IPL Playoffs: పదిలో నాలుగు మిగిలాయి.. ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్లేఆఫ్స్‌ ఇలా..!

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) తుది దశకు చేరింది. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక ప్లేఆఫ్స్‌ (IPL Playoffs) సమరం మాత్రమే మిగిలి ఉంది. టైటిల్‌ కోసం నాలుగు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

Updated : 22 May 2023 16:46 IST

ఇంటర్నెట్ డెస్క్: మొత్తం 10 జట్లు.. 70 లీగ్‌ మ్యాచ్‌లు.. దాదాపు యాభై రోజులుకుపైగా ఉత్కంఠ పోరులు.. ఇదీ ప్రస్తుత సీజన్‌లో కనువిందు చేసిన ఐపీఎల్‌. చివరికి నాలుగు జట్లు టైటిల్‌ రేసులో నిలిచాయి. ఆరు జట్లు ఇంటిముఖం పట్టాయి. ఇక నాలుగే మ్యాచ్‌లు విజేతను తేలుస్తాయి. మంగళవారం (మే 23న) నుంచి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ప్రారంభవుతాయి. 

గుజరాత్‌ టైటాన్స్‌ (20 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్‌ (17 పాయింట్లు, +0.652 నెట్‌రన్‌రేట్), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (17 పాయింట్లు, +0.284 నెట్‌రన్‌రేట్), ముంబయి ఇండియన్స్‌ (16 పాయింట్లు) నాలుగు స్థానాల్లో నిలిచాయి. టాప్‌-2లో ఉన్న జట్లు క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లను ఆడతాయి. ఇక  మూడు, నాలుగు స్థానాల్లోని జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను ఆడతాయి. 

  • మే 23న గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ (GT vs CSK) జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్‌ వేదికగా జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
  • మే 24న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఉంటుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్‌ (LSG vs MI) టీమ్‌లు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో ఆడుతుంది. దీనికి కూడా వేదిక చెపాక్‌ స్టేడియమే.
  • మే 26న సెకండ్‌ క్వాలిఫయర్‌ జరగనుంది. మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేత తలపడాల్సి ఉంటుంది. రెండో క్వాలిఫయిర్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.
  • ఇక ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరుగుతుంది. తొలి క్వాలిఫయర్‌ విజేత X రెండో క్వాలిఫయర్‌ విజేత మధ్య టైటిల్ కోసం పోరు ఉంటుంది. నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
  • ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. అర్ధగంట ముందు టాస్‌ వేస్తారు. జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. స్టార్‌స్పోర్ట్స్‌లో వీక్షించే అవకాశం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని