IPL 2024: డిసెంబరు 19న వేలం.. ఏ జట్టులో ఎవరున్నారంటే?

ఐపీఎల్ (IPL 2024) సీజన్‌ కోసం డిసెంబరు 19న దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు. 333 మంది ఆటగాళ్లు అమ్మకానికి ఉండగా.. 77 ఖాళీలు ఉన్నాయి. 

Published : 18 Dec 2023 17:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2024) సీజన్‌ కోసం డిసెంబరు 19న దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు. 333 మంది ఆటగాళ్లు అమ్మకానికి ఉండగా.. 77 ఖాళీలు ఉన్నాయి. 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్‌ వద్ద అత్యధికంగా రూ.38.15 కోట్లు, అత్యల్పంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ.13.15 కోట్ల సొమ్ము ఉంది. ప్రస్తుతం ఆయా జట్లలో ఉన్న ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం.

గుజరాత్ టైటాన్స్‌ (GT)

డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్‌ సాహా, కేన్‌ విలియమ్సన్, అభినవ్‌ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమి, నూర్ అహ్మద్‌, సాయి కిషోర్, రషీద్‌ ఖాన్‌, జోష్‌ లిటిల్, మోహిత్ శర్మ.

ముంబయి ఇండియన్స్‌ (MI)

హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ తెందూల్కర్, రొమారియో షెఫర్డ్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్‌ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, బెరెన్‌డార్ఫ్‌.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్‌, మహిపాల్ లామ్రోర్, కర్ణ్‌ శర్మ, కామెరూన్‌ గ్రీన్‌, మనోజ్ భాంగే, మయాంక్ దగార్, వైశాఖ్‌ విజయ్ కుమార్‌, ఆకాశ్‌ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్. 

పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)

శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్), జితేశ్ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, లివింగ్ స్టోన్, హర్‌ప్రీత్‌ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్‌ కరన్‌, సికిందర్‌ రజా, శివమ్‌ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్ సింగ్, కాగిసో రబాడ, నాథన్ ఎలిస్‌, రాహుల్ చాహర్‌, విద్వత్ కావేరప్ప.

రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)

సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, హెట్‌మయర్‌, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురెల్, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డొనొవాన్‌ పెరీరా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ సేన్, నవదీప్‌ సైని, ప్రసిద్ధ్‌ కృష్ణ, సందీప్‌ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేశ్‌ ఖాన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)

నితీశ్ రాణా, రింకు సింగ్, రహ్మనుల్లా గుర్భాజ్‌, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), జేసన్ రాయ్‌, అనుకుల్ రాయ్‌, ఆండ్రె రసెల్, వెంకటేశ్‌ అయ్యర్, సుయాశ్ శర్మ, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వైభవ్ అరోడా, వరుణ్ చక్రవర్తి. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH)

అబ్దుల్ సమద్‌, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్‌ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, అభిషేక్‌ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్‌ సింగ్, షాబాజ్‌ అహ్మద్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, టి.నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.

దిల్లీ క్యాపిటల్స్‌ (DC)

రిషభ్‌ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్‌ ధూల్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్‌, ప్రవీణ్‌ దూబె, విక్కీ ఓస్త్వాల్‌, అన్రిచ్‌ నోర్జే, కుల్‌దీప్‌ యాదవ్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్‌ కుమార్‌.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)

ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్), డేవాన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, అజింక్య రహానె, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్‌ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, తుషార్‌ దేశ్‌పాండే, మతీశా పతిరన.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)

కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్‌ బదోని, దీపక్‌ హుడా, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య,  కైల్ మేయర్స్‌, మార్కస్ స్టాయినిస్, ప్రేరక్ మన్కడ్, యుధ్విర్‌ సింగ్, మార్క్‌ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్‌, రవిబిష్ణోయ్, యశ్ ఠాకూర్‌, అమిత్ మిశ్రా, నవీనుల్ హక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని