Virat Kohli: మా భాగస్వామ్య రహస్యం టాటూలే.. : విరాట్ కోహ్లీ
ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి విజయవంతమైన భాగస్వామ్యాలు నిర్మించడంపై విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పందించాడు. దీనిపై సరదా వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఈ సీజన్(IPL 2023)లో ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్(Virat Kohli-Faf du Plessis) ఓపెనింగ్ జంట అదరగొడుతోంది. సన్‌రైజర్స్(sunrisers hyderabad)తో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ ఈ జంట అద్భుతంగా ఆడింది. తొలి వికెట్‌కు వీరు 172 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఇక కోహ్లీ-డుప్లెసిస్ జంట విజయవంతమవడం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించగా.. ‘ మా ఇద్దరికి టాటూలు ఒకే విధంగా ఉన్నాయి. అందుకే అయి ఉంటుంది’ అని కోహ్లీ మ్యాచ్ అనంతరం సరదా సమాధానం చెప్పాడు. ‘కీలకమైన మ్యాచ్‌లో నేను ఇంపాక్ట్ చూపించినప్పుడు.. అది నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అలాగే జట్టుకు కూడా. ఇక మా ఇద్దరి భాగస్వామ్య రహస్యం టాటూలు అయి ఉంటాయి. ఈ సీజన్‌లో మేమిద్దరం(Virat Kohli-Faf du Plessis) కలిసి దాదాపు 900 పరుగులు చేశాం. గతంలో ఏబీడీ(AB de Villiers)తో ఎలా అయితే ఆడానో.. ఇప్పుడు డుప్లెసిస్‌తో కలిసి అలాగే మ్యాచ్‌లను ముందుకు తీసుకెళ్తున్నాను. ఆట ఎటు వెళ్తుంది.. తర్వాత ఏం చేయాలనేదానిపై ఇద్దరి మధ్య అవగాహన ఉండాలంతే. అంతర్జాతీయ స్థాయి అనుభవమున్న కెప్టెన్‌ను కలిగి ఉండటం మా జట్టుకు కలిసివస్తోంది’ అని కోహ్లీ వివరించాడు.
ఇక హైదరాబాద్ స్టేడియంలో అభిమానుల నుంచి వచ్చిన స్పందనపై మాట్లాడుతూ..‘ఇది మా సొంతమైదానం వలే అనిపించింది. ఇక్కడి అభిమానులు మాకెంతో మద్దతు ప్రకటించారు. వారు నా పేరును పదే పదే ఉచ్ఛరిస్తూ.. మమ్మల్ని ఉత్సాహపరిచారు. దీన్ని మనం సృష్టించలేం. ఇలా చేయాలని మనం ఎవర్నీ బలవంత పెట్టలేం. నేను మైదానంలో ప్రతిదీ నిజాయతీతో చేస్తాను. అందుకే ఇంత గొప్ప అభిమానం నాకు దక్కిందని అనుకుంటున్నాను’ అని కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు