కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్‌ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేరుస్తుందా?

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌నకు ఇప్పటికే మూడు జట్లు చేరాయి. టాప్‌ 4లోకి చేరే నాలుగో జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Updated : 18 May 2024 12:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీకి.. నంబర్‌ ‘18’కు ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి జెర్సీ నంబర్‌ ఇదే. ఇప్పటికే ఈ నంబర్‌తో ఉన్న అనుబంధాన్ని ఎన్నోసార్లు విరాట్‌ పంచుకోగా.. ఈ ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సందర్భంగా మరోసారి ఈ నంబరు తెరపైకి వస్తోంది. దాని వెనకున్న ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం..

  • ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌నకు ఇప్పటికే మూడు జట్లు (కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌) చేరాయి. టాప్‌ 4లో నిలిచే నాలుగో జట్టుపైనే అందరి దృష్టి. అయితే.. ఆ అవకాశం రెండు జట్లకు మాత్రమే ఉంది. చెన్నై, బెంగళూరు మధ్య జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆ నాలుగో జట్టును తేల్చనుంది. ఈ మ్యాచ్‌ జరిగేది మే ‘18’న కావడం విశేషం.
  • ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినా.. ఫ్లేఆఫ్స్‌ చేరడానికి చాలా సమీకరణాలు ఉన్నాయి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేస్తే ‘18’ పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే ‘18’.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పుడే కోహ్లీ జట్టు టాప్‌ 4లోకి చేరుతుంది.
  • 2013 నుంచి ఐపీఎల్‌లో బెంగళూరు మే ‘18’ నాడు ఆడిన వాటిల్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడలేదు. 
  • ఇక మే 18నే విరాట్‌ అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన చేశాడు. ఈ తేదీనే రెండు శతకాలు, ఒక అర్ద శతకం బాదాడు.
  • మే 18న ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండుసార్లు చెన్నైతో తలపడింది. ఈ రెండింటిలోనూ బెంగళూరే విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ రాణించడం విశేషం.
  • మరోసారి మే 18నే తాజా మ్యాచ్‌ జరుగుతుండటం.. ఈ తేదీ ఆర్సీబీకి, కోహ్లీకి కలిసి వస్తుండటంతో.. ఈసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో.. లేదో చూడాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు