Virat Kohli: ఆత్మగౌరవం కోసం ఆడాం

ఈ ఐపీఎల్‌లో తొలి 8 మ్యాచ్‌ల్లో 7  ఓడి ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైనట్లే కనిపించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. కానీ తర్వాత అనూహ్య రీతిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు నెగ్గి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.

Published : 24 May 2024 03:15 IST

బెంగళూరు

ఈ ఐపీఎల్‌లో తొలి 8 మ్యాచ్‌ల్లో 7  ఓడి ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైనట్లే కనిపించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. కానీ తర్వాత అనూహ్య రీతిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు నెగ్గి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే స్ఫూర్తితో కప్పు కూడా గెలుస్తుందని ఆశిస్తే.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి నిరాశ కలిగించినప్పటికీ.. సీజన్లో తమ ప్రదర్శన పట్ల గర్విస్తున్నామని చెప్పాడు విరాట్‌ కోహ్లి. వరుస ఓటములతో సీజన్‌ మధ్యలో తమ జట్టు కుంగిపోయిందని, ఆ దశలో ఆత్మగౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాక తమ దశ తిరిగిందని కోహ్లి వెల్లడించాడు. ‘‘లీగ్‌ దశ చివరి ఆరు మ్యాచ్‌ల్లో గెలవడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇలాంటి ప్రత్యేక ప్రదర్శన చేసినపుడు ఇంకా గొప్పగా ఏదైనా చేయాలన్న ప్రేరణ కలుగుతుంది. ఆ దశలో మాకు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభించింది. మేం ఆత్మగౌరవం కోసం ఆడడం మొదలుపెట్టాం. అప్పుడే మా ఆత్మవిశ్వాసం తిరిగొచ్చింది. మేం మొత్తం కథను మార్చి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తీరు ఎంతో ప్రత్యేకం. దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఈ పరిణామం జట్టులో ప్రతి ఆటగాడి దృఢమైన వ్యక్తిత్వాన్ని బయటికి తీసింది. ఈ విషయంలో మేమంతా గర్వించవచ్చు. మేం ఎలా కోరుకున్నామో అలా ఆడాం. సీజన్‌ మధ్యలో మేం పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్నాం. ఒకసారి ఊపు వచ్చాక దాని మీదే ముందుకు వెళ్లాం. ఇంకో రెండు అడుగులు వేసి ట్రోఫీ గెలవకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కానీ ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే.. మా కథ దాదాపు ముగిసిన దశ నుంచి పుంజుకుని సీజన్‌ను ఇలా ముగించడం గర్వంగా అనిపిస్తోంది’’ అని కోహ్లి చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని