Kolkata VS Bengaluru: బెంగళూరు పోరాడినా.. విజయం కోల్‌కతాదే!

ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Updated : 21 Apr 2024 20:00 IST

కోల్‌కతా: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 221కే ఆలౌటయ్యింది. జాక్స్‌ (55; 32 బంతుల్లో 4×4;5×6), పాటిదార్‌ (52; 23 బంతుల్లో 3×4, 5×6) అర్ధశతకాలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ (18), డుప్లెసిస్‌ (7) తీవ్ర నిరాశ పరిచారు. ప్రభుదేశాయ్‌ (24), గ్రీన్‌ (6) మహిపాల్‌ (4) పెద్దగా రాణించలేదు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (24), శర్మ(20) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, సునీల్‌ నరైన్‌ చెరో 2, వరుణ్‌ చక్రవర్తి, స్టార్క్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాల్ట్‌ (48; 14 బంతుల్లో 7×4, 3×6) చెలరేగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (50; 36 బంతుల్లో 7×4, 1×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రింకూ సింగ్‌ (24), రసెల్‌  (27*), రమణ్‌దీప్‌ (24*) ఫర్వాలేదనిపించారు. నరైన్‌ (10), రఘువంశీ (3), వెంకటేశ్‌ అయ్యర్‌ (16) నిరాశపరిచారు. బౌలర్లలో యశ్‌ దయాల్‌, గ్రీన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ఫెర్గూసన్‌ తలో వికెట్‌ తీశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని