Lucknow vs Punjab: ధావన్‌ పోరాటం వృథా.. బోణీ కొట్టిన లఖ్‌నవూ

ఐపీఎల్‌ - 2024 సీజన్‌లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 30 Mar 2024 23:54 IST

లఖ్‌నవూ: ఐపీఎల్‌ - 2024 సీజన్‌లో లఖ్‌నవూ బోణీ కొట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో పంజాబ్‌కు శుభారంభమే దక్కినా చివర్లో దూకుడుగా ఆడలేక ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శిఖర్ ధావన్‌ (70; 50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాటం వృథా అయింది. జానీ బెయిర్‌స్టో (42; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (19; 7 బంతుల్లో) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. జితేశ్‌ శర్మ (6), సామ్ కరన్ (0) తీవ్రంగా నిరాశపర్చారు. లివింగ్‌స్టోన్‌ (28*; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరింత దూకుడుగా ఆడితే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. లఖ్‌నవూ బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు మయాంక్‌ యాదవ్‌ (3/27) అదరగొట్టాడు. మోసిన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

లఖ్‌నవూ బ్యాటర్లలో క్వింటన్ డికాక్‌ (54; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. చివర్లో కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో లఖ్‌నవూ భారీ స్కోరు సాధించింది. స్టాయినిస్ (19), కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్ 3, అర్ష్‌దీప్‌ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని