Arjun Tendulkar: ‘బంధుప్రీతి అంటూ అర్జున్‌ను వెక్కిరించారు..’ : ప్రీతిజింతా

అర్జున్‌ తెందూల్కర్‌(Arjun Tendulkar) ప్రదర్శనను ప్రీతి జింతా అభినందించారు. అతడి ప్రదర్శనపై తండ్రిగా సచిన్‌ గర్వపడాలన్నారు.

Updated : 19 Apr 2023 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఆడేది రెండో ఐపీఎల్‌ మ్యాచే అయినా.. అనుభవజ్ఞుడైన బౌలర్‌లా ఆఖరి ఓవర్‌లో బంతులు సంధించి ముంబయి(Mumbai Indians) విజయంలో కీలక పాత్ర పోషించాడు సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌(Arjun Tendulkar). దీంతో అతడి ప్రదర్శనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అతడిపై విమర్శలు చేసిన వారు.. ఇప్పుడతడి ఆటతీరును చూడాలని సూచిస్తున్నారు.

మంగళవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ బౌలింగ్‌ ప్రదర్శనను బాలీవుడ్‌ నటి, పంజాబ్‌ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింతా(Preity Zinta) మెచ్చుకున్నారు. ‘చాలా మంది బంధుప్రీతి అంటూ అతడిని ఎగతాళి చేశారు. ఈ మ్యాచ్‌లో అతడేంటో నిరూపించుకున్నాడు. అర్జున్‌కు అభినందనలు. సచిన్‌ కచ్చితంగా గర్వించాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘అర్జున్‌ ఎంతో ఎదిగాడు. ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసి కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడు. తొలి వికెట్‌ కూడా తీసుకున్నాడు. పాజీ(సచిన్‌)కి అభినందనలు.. అర్జున్‌కు విజయవంతమైన సుదీర్ఘ కెరీర్‌ ఉండాలని కోరుకుంటున్నాను’- మహమ్మద్‌ ఖైఫ్‌

‘అర్జున్‌ బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం అతడికి లభించింది. ఒక తండ్రిగా సచిన్‌ ఎంతో గర్వపడాలి. భవిష్యత్తులో గొప్ప విజయాలకు ఇది ఆరంభం మాత్రమే’- సెహ్వాగ్‌

‘యువ తెందూల్కర్‌ నుంచి ఇలాంటి ఆటతీరు చూడటం ఎంతో సంతోషంగా ఉంది’ -ఇర్ఫాన్‌ పఠాన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని