ShabaashMithu : క్రీడాకారిణులకు మిథాలీ జీవితం స్ఫూర్తివంతం: కైఫ్‌

టీమ్‌ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ బయోపిక్ ‘శభాష్ మిథూ’. బాలీవుడ్ నటి తాప్సీ పొన్ను టైటిల్‌ రోల్‌ ...

Published : 17 Jul 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ బయోపిక్ ‘శభాష్ మిథూ’. బాలీవుడ్ నటి తాప్సీ పొన్ను టైటిల్‌ రోల్‌ పోషించింది. సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చేసింది. తాజాగా సినిమాను వీక్షించిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘ఈ చిత్రం కేవలం మిథాలీ రాజ్‌ క్రికెట్‌ ప్రయాణం మాత్రమే కాకుండా ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఎంతో హృదయానికి హత్తుకునేలా తీశారు. క్రీడల్లోని మహిళలకు మిథాలీ రాజ్‌ జీవితం స్ఫూర్తివంతం’’ అని కైఫ్ పోస్టు చేశాడు. 

‘శభాష్ మిథూ’ చిత్రంపై ఇప్పటికే మిథాలీరాజ్‌ ట్విటర్‌లో భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ‘‘శభాష్ మిథూ సినిమాతో నా లైఫ్‌ జర్నీని గుర్తు చేసుకోవడం భావోద్వేగంగా అనిపిస్తుంది. టైటిల్‌ రోల్‌ను పోషించిన తాప్సీ అద్భుతంగా చేసింది’’ అని మిథాలీ ట్వీట్‌ చేసింది. గత నెలలోనే తన 23 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు మిథాలీరాజ్‌ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా తరఫున మిథాలీ రాజ్ ఆరు ప్రపంచకప్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది. మిథాలీ 232 వన్డేల్లో 7,805 పరుగులు, 12 టెస్టుల్లో 699 పరుగులు, 89 టీ20ల్లో 2,364 పరుగులు చేసింది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని