ENG vs IND: బుమ్రాకు కాస్త మద్దతు ఇవ్వండి: భారత బౌలర్లకు షమీ సూచన

Eenadu icon
By Sports News Team Published : 27 Jun 2025 03:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో లీడ్స్‌ టెస్టులో భారత (Team India) బౌలింగ్‌ బలహీనత బయటపడింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో రాణించినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్టూ దక్కలేదు. సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ కాస్త ఎక్కువగా పరుగులు ఇవ్వడం భారత్‌కు నష్టం చేసింది. దీంతో 370+ టార్గెట్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ క్రమంలో బుమ్రా మినహా మిగతా టీమ్‌ఇండియా బౌలింగ్‌ యూనిట్‌పై మహ్మద్ షమీ అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రాకు మద్దతుగా ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. 

‘‘భారత బౌలర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో మిగతా బౌలర్లు మాట్లాడాలి. అతడి నుంచి నేర్చుకోవాలి. ఎలా బౌలింగ్‌ చేయాలనేది ప్రణాళిక వేసుకోవాలి. అతడికి మద్దతుగా ఉండాలి. అప్పుడే మనం సులువుగా విజయం సాధించగలం. నేను తొలి మ్యాచ్‌ గురించి మాట్లాడుతున్నా. బౌలింగ్‌ విభాగంపై మరింత వర్కౌట్ చేయాలి. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండో ఇన్నింగ్స్‌లో రెండేసి వికెట్లు తీశారు. శార్దూల్ స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసినా.. అప్పటికే భారత్‌ చేతుల్లో మ్యాచ్‌ లేదు. కొత్త బంతితో వికెట్లు తీయడం ముఖ్యం. బుమ్రాకు సపోర్ట్‌ ఇవ్వాలి. ఇంగ్లాండ్‌ (ENG vs IND) తొలి టెస్టులో విజయం సాధించడానికి కారణం భారత బౌలర్లు సులువుగా పరుగులు ఇవ్వడమే. మన బౌలింగ్‌ విభాగం మరింత బలంగా తయారు చేయడానికి ఏం చేయాలనేది మార్గాలను వెతకాలి’’ అని షమీ వ్యాఖ్యానించాడు.

జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా ఇంగ్లాండ్ - భారత్ (India vs England) జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఆడటంపైనా అనుమానాలు నెలకొన్నాయి. అతడిపై పనిభారం లేకుండా చేయాలనే ఉద్దేశంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ ఉంది. అందుకే, మూడు టెస్టుల్లోనే ఆడించాలని భావిస్తోంది. అందుకే రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి స్పష్టత రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని