Hasin Jahan: నన్ను ఎవరూ భయపెట్టలేరు.. అలాగైతే 2018లోనే భయపడేదాన్ని: షమీ మాజీ భార్య హసీన్‌

Eenadu icon
By Sports News Team Published : 30 Aug 2025 00:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత పేస్‌ బౌలర్‌ మహ్మద్ షమీ(Mohammed Shami) నుంచి విడిగా ఉంటోన్న అతడి భార్య హసీన్‌ జహాన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను భయపెట్టేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని, అయితే ఆ బెదిరింపులకు తాను భయపడలేదని, ఒత్తిడికి తలొగ్గలేదని చెప్పారు. ఎవరూ తన జీవితాన్ని నాశనం చేయలేరని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 

‘‘నేను పిచ్చి కుక్కలకు భయపడి ఉంటే 2018లోనే భయపడేదానిని. నన్ను ఎంత భయపెట్టాలని, నాశనం చేయాలని చూసినా అంతే స్థాయిలో బలపడతాను’’ అని హసీన్‌ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మహ్మద్‌ షమీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. గతం గురించి తలుచుకోవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. నాతో సహా తాను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా క్రికెట్‌ పైనే ఉంది. నాకు వివాదాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని షమీ చెప్పాడు. ఈ నేపథ్యంలో షమీ వ్యాఖ్యలపై జహాన్‌ స్పందించినట్లు తెలుస్తోంది.

యూపీకి చెందిన షమీ 2014లో హసీన్‌ జహాన్‌ను వివాహమాడారు. 2015లో వీరికి పాప జన్మించింది. అయితే 2018లో షమీ, అతడి కుటుంబ సభ్యులపై హసీన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. షమీపై గృహహింస కేసు పెట్టింది. అప్పటినుంచి న్యాయపోరాటం చేస్తోంది. ఇటీవల హసీన్‌, తన కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ.4లక్షల భరణం చెల్లించాలని షమీకి కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఇందులో రూ. 1.5 లక్షలు భార్య జహాన్‌ కోసం, రూ.2.5 లక్షలు కుమార్తె కోసం వెచ్చించేందుకు చెల్లించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని