MS Dhoni: రాంచీ వీధుల్లో.. వింటేజ్ కారులో ధోని చక్కర్లు

రాంచీ వీధుల్లో వింటేజ్‌ కారులో ధోని చక్కర్లు కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ధోని ప్రత్యేకతే వేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Published : 26 Jul 2023 14:06 IST

రాంచీ: టీమిండియా (Team India) మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni)కి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. తనకు నచ్చిన వాహనం కనిపిస్తే చాలు.. కొత్త మోడల్‌ నుంచి వింటేజ్‌ మోడల్‌ వరకూ ఏదైనా తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన వద్ద ఉన్న కారు లేదా బైక్‌పై రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. తాజాగా వింటేజ్‌ మోడల్‌ కారులో ధోని ప్రయాణిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రీషెడ్యూల్‌ కానుందా..?

1980 మోడల్‌ బ్లూ కలర్ రోల్స్ రాయిస్‌ కారులో ధోని రాంచీ రోడ్లపై ప్రయాణిస్తున్న వీడియోను.. బైక్‌పై వెళుతున్న వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 43 ఏళ్ల క్రితంనాటి కారును ధోని స్వయంగా డ్రైవ్‌ చేస్తూ వెళుతుండటం వీడియోలో చూడొచ్చు. పక్క సీట్లో జీవా కూర్చుని ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ధోని స్టైలే వేరు’, 90ల్లో సినిమా పాట, ధోని రైడ్‌ రెండు సూపర్‌’, ‘అందుకే ఇతరులకంటే ధోని ప్రత్యేకం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొద్దిరోజులు క్రితం రాంచీ ఫామ్‌హౌజ్‌లో ధోని కారు, బైక్‌ కలెక్షన్‌కు సంబంధించిన వీడియోను మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఆ సందర్బంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని