HBD MS Dhoni: ధోనీ ఎప్పటికీ గ్రేట్.. అందుకే దిగ్గజాలే సలామ్ కొట్టారు!
‘ధోని’జం పుట్టి 41 ఏళ్లు...
ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ. జార్ఖండ్ డైనమైట్.. కెప్టెన్ కూల్.. ద ఫినిషర్.. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. అయితే ఆరంభంలో బ్యాట్ ఝుళిపించి సిక్సర్ల మోత మోగిస్తుంటే అతడొక విధ్వంసక బ్యాట్స్‌మన్ అనుకున్నారంతా.. కానీ ధోనీ సారథిగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధిస్తేగానీ తెలియలేదు.. టీమ్‌ఇండియా కోసమే ఉద్భవించిన గొప్ప నాయకుడని.
ధోనీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎందుకంటే అతడు సృష్టించింది ఒక చరిత్ర. సాధించిన ఘనతలెన్నో, వరించిన పురస్కారాలెన్నో. అందుకే ప్రపంచ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు సైతం ధోనీకి సలాం కొట్టారు. ప్రస్తుతం ధోనిజం 42వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా మేటి ఆటగాళ్లనే మాయ చేసిన మాహి మహిమలేంటో.. ఓ లుక్కేద్దాం.
నేను చనిపోయే ముందు, 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన సిక్సర్‌నే చివరిగా చూడాలనుకుంటున్నాను
- సునీల్ గావస్కర్
భారత క్రికెట్ చరిత్రలో 2011 వన్డే ప్రపంచకప్ విజయం గొప్ప మైలురాయి. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన తీరు ఏ క్రికెట్ అభిమానీ మరిచిపోలేడు. దిగ్గజ క్రికెటర్ గావస్కర్ సైతం ఈ వ్యాఖ్య చేశాడంటే ధోనీ సిక్సర్ అతడిని ఎంత ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్ 91*. అతడి కెరీర్‌లో అతిపెద్ద ఘనత.
చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైతే, ఒత్తిడి బౌలర్‌పై ఉంటుంది. ధోనీపై కాదు
- ఇయాన్ బిషప్
మ్యాచ్‌ను ముగించాలంటే మహినే. 2012లో ఆస్ట్రేలియాతో మ్యాచ్.. ఓవర్‌కి 13 పరుగులు కావాలి. క్రీజ్‌లో ధోనీ. బౌలింగ్‌కి వచ్చిన క్లెంట్ మెకాయ్‌కు అవకాశమే ఇవ్వకుండా 4 బంతుల్లోనే మ్యాచ్ ముగించేశాడు. 2013లో శ్రీలంక పై చివరి ఓవర్‌లో 15 పరుగులు కావాలంటే రెండు బంతులు ఉండగానే ధోనీ భారత్‌ను గెలిపించాడు. బౌలర్ శమిందా ఎరంగా ఆ ఓవర్‌లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. విండీస్ దిగ్గజం బిషప్ అన్నట్లుగానే ఆ తరవాత కూడా ధోనీ పినిషింగ్ దెబ్బకు ఎంతో మంది మేటి బౌలర్లు సైతం తలవొంచారు.
ధోనీ నా హీరో. మనం సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ గురించి చాలా మాట్లాడుకుంటాం, కానీ ఈ కుర్రాడి ఆటలో ఎవరికీ లేనంత ప్రతిభ ఉంది
- కపిల్‌దేవ్
కెరీర్ ఆరంభంలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌లు (148, 183).. యంగ్‌ఇండియాతో ధోనీ 2007లో చేసిన మ్యాజిక్ గుర్తుంది కదా! పాక్‌పై ఉత్కంఠపోరులో ధోనీ జట్టును నడిపించిన తీరు.. మాజీ సారథి కపిల్‌దేవ్‌ను కట్టిపడేసింది.
ఆసియాలోనే కాదు. ప్రపంచంలోనే ధోనీవి అత్యంత వేగవంతమైన చేతులు
- కుమార సంగక్కర
0.08 సెకెండ్స్ రెప్పపాటు కంటే తక్కువ సమయం. ధోనీ 2018లో 0.08 సెకెన్లులోనే స్టంప్ చేసి రికార్డు సృష్టించాడు. బ్యాటర్ కీమో పౌల్ బిత్తర చూపులు చూస్తూ పెవిలియన్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఈ స్టంపింగ్‌కు శ్రీలంక దిగ్గజం సంగక్కర ఫిదా అయ్యి.. ఈ విధంగా కామెంట్ చేశాడు.
నా ఆట చూసేందుకు డబ్బు చెల్లిస్తానని ఎవరైనా చెప్పినప్పుడు.. ధోనీ బ్యాటింగ్ చూడటానికి నేను డబ్బు చెల్లిస్తానని చెప్పగలను. గిల్‌క్రిస్ట్ తర్వాత ఎంఎస్ ధోనీ కాదు. ధోనీనే ఫస్ట్
- ఆడమ్ గిల్‌క్రిస్ట్
ధోనీ చిన్నప్పటి నుంచి సచిన్, గిల్‌క్రిస్ట్ అభిమాని. అలాంటి అభిమాన క్రికెటర్ గిల్లీ (ఆస్ట్రేలియా) ఈ విధంగా ప్రశంసించాడంటే.. ధోనీ అతడిని ఎంతలా ఆకట్టుకున్నాడో తెలుస్తుంది.
బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ధోనీ నిర్ణయం నా కెరీర్‌నే మార్చేసింది. భాయ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విశ్వసిస్తా
- రోహిత్ శర్మ
టీమ్ఇండియా సారథిగా, గొప్ప ఆటగాడిగా రోహిత్ శర్మ పేరు సంపాదించాడంటే దీని వెనుక మహి మహిమ ఉంది. 2011 ప్రపంచకప్‌లో చోటు దక్కక, మరోవైపు ఫామ్‌లేక సతమతం అవుతున్న రోహిత్ శర్మను 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ చేసే అవకాశం ఇచ్చాడు ధోనీ. అంతే అక్కడి నుంచి ఇప్పటి వరకు రోహిత్ వెనక్కితిరిగి చూసుకోలేదు. ధోనీ నిర్ణయం అతడిని ఏ స్థాయికి తీసుకొచ్చిందో చూస్తున్నాం.
ధోనీ మన దేశానికి గొప్ప కెప్టెన్, అతడి రికార్డులే అందుకు నిదర్శనం
- సౌరవ్ గంగూలీ
ధోనీ సారథిగా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో భారత్ నం.1. ఇవే గంగూలీ లాంటి గొప్ప నాయకుడి చేతే ధోనీనే గ్రేట్ కెప్టెన్ అని చెప్పించాయి. ఒక భారత్‌లోనే కాదు. మరే ఏ దేశంలోనూ ఒక కెప్టెన్ ఇన్ని ఘనతలు సాధించలేదు.
నేను చాలామంది కెప్టెన్సీలో ఆడాను. నాకు మాత్రం ధోనీనే బెస్ట్ కెప్టెన్
- సచిన్ తెందూల్కర్
టీమ్‌ఇండియా కోసం సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. అయితే తన 24 ఏళ్ల క్రికెట్ జర్నీలో సచిన్ ఎంతో మంది కెప్టెన్‌లను చూశాడు. తాను కెప్టెన్‌గా చేశాడు. కానీ తన చిరకాల కోరిక తీరింది మాత్రం ధోనీ కెప్టెన్సీలోనే. 2011 ప్రపంచకప్ విజయం.. సచిన్ ఎప్పటికీ మరిచిపోలేని రోజు. తన సొంత మైదానంలో సహచర క్రికెటర్లు భుజాలపై ఎత్తుకుంటే.. సచిన్ కంటి వెంట ఆనంద బాష్పాలు ప్రతి క్రికెట్ అభిమాని గుర్తుంచుకుంటాడు. అందుకే సచిన్‌లాంటి దిగ్గజాన్ని మెప్పించిన కెప్టెన్ ధోనీ మాత్రమే.
భారత క్రికెట్‌పై ఎంఎస్ ధోనీ కంటే ఎక్కువ నిబద్ధత ఉన్నవారు ఎవరూ లేరు
- విరాట్ కోహ్లీ
2012లో పాక్‌తో మ్యాచ్ అది. వేదిక చెన్నై. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన భారత బ్యాటర్లు ఆ పిచ్‌పై బ్యాటింగ్ చేయలేక అల్లాడుతున్నారు. 29 పరుగులకే టాప్ 5.. సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ, యువరాజ్, రోహిత్ సింగిల్ డిజిట్ స్కోరు చేసి పెవిలియన్ చేరారు. అయితే క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ జట్టు కోసం పోరాడిన తీరు అద్భుతం. ఒకవైపు పిచ్ బ్యాటింగ్ ఏ మాత్రం సహకరించట్లేదు. మరోవైపు మైదానంలో వేడి తీవ్రత. అసలు ఒక పరుగు తీస్తే సాహసం అన్నట్లు ఉంది అక్కడ పరిస్థితి. అయినా ధోనీ ఐస్ బ్యాగ్స్ పెట్టుకొని మరి ఆడి చివరి వరకు క్రీజ్‌లో ఉండి 125 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 పరుగులు చేయడంతో భారత్ 50 ఓవర్లలో 227 పరుగుల మార్క్ అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. జట్టు కోసం అంతలా పోరాడినా ధోనీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
మహేంద్ర సింగ్ ధోనీపై ప్రముఖుల వ్యాఖ్యలు...
💬 గొప్ప నాయకుడికి ఉదాహరణ ధోనీ - రాహుల్ ద్రవిడ్
💬 ధోనీ నా వెంట ఉంటే ప్రపంచంతో యుద్ధం చేస్తాను - గ్యారీ కిర్‌స్టన్
💬 ధోనీ జర్నీ అద్భుతం, అసామాన్యం - వీవీఎస్ లక్ష్మణ్
💬 నేను జట్టును ఎంపిక చేయాల్సి వస్తే ఓపెనర్‌గా సచిన్, కెప్టెన్‌గా ధోనీ ఉంటాడు - స్టీవ్ వా
💬 ఎంఎస్ ధోనీ చివరి వరకు ఆడితే కచ్చితంగా తన జట్టును గెలిపిస్తాడు - హర్షా బోగ్లే
💬 ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఆడడం నా అదృష్టం - మైక్ హస్సీ
💬 ధోనీ క్రికెటర్‌గానే కాకుండా నాయకుడిగా ఎదిగాడు. నా అభిప్రాయం ప్రకారం ఇండియాలో అత్యుత్తమ కెప్టెన్ అతడే - వసీం అక్రమ్
💬 ఒత్తిడిలో సిక్స్ కావాలంటే ధోనీ అని పిలవండి - రమీజ్ రాజా
💬 చివరి ఓవర్లలలో ధోనీ బ్యాటింగ్‌కు రాకూడదు అని కోరుకుంటా - రికీ పాంటింగ్
💬 ధోనీ ఆడే అన్ని దేశాల్లో అతడికి గౌరవం ఉంది. ఆయన బలమైన నాయకుడు - గ్లెన్ మెక్‌గ్రాత్
💬 భారతీయులారా, ధోనీకి ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంలో మీ సమయాన్ని వృథా చేస్తున్నారు. ఈ వ్యక్తి 2027 వరకు ఆడినా మ్యాచ్‌లను ముగించగలడు - బ్రాడ్ హాగ్
💬 మీరు బ్యాటింగ్ నేర్చుకోవాలనుకుంటే.. ఎంఎస్ ధోనీతో బ్యాటింగ్ చేయండి - రవీంద్ర జడేజా
💬 ధోనీతో వేదిక పంచుకోవడానికి నేను కోటి రూపాయలు కూడా చెల్లిస్తాను. అతడే నాకు అతిపెద్ద స్ఫూర్తి - ఎస్.ఎస్. రాజమౌళి
💬 ఎంఎస్ ధోనీ వైఖరి నాకు స్ఫూర్తిదాయకం - ‘కేజీయఫ్’ హీరో యశ్
💬 ఎంఎస్ ధోనీ నా ఫేవరెట్ క్రికెటర్, అతడు దబాంగ్ ప్లేయర్ - సల్మాన్ ఖాన్
‘‘నీ వెన్నంటి వేల మంది ఉన్నారని ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవొచ్చు. అదే నువ్వు ముందు ఉన్నావని వేలమందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవొచ్చు’’
అని ఒక సినిమాలో చెప్పినట్లు... ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ధోనీ.. క్రికెటర్ అవ్వాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది యువ క్రికెటర్లకు ధోనీ స్ఫూర్తిగా నిలిచాడు. అయినా తనింకా నిత్య విద్యార్థిని అనే నమ్ముతాడు... ఆచరిస్తాడు. అందుకే ధోనీ నువ్వు ఎప్పటికీ గ్రేట్!
హ్యాపీ బర్త్ డే మాహీ... వి లవ్ యూ!
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Video: భారత్ 75 ఏళ్ల ప్రయాణం.. 2 నిమిషాల వీడియోలో..!
-
India News
India Corona: కాంగ్రెస్‌లో కరోనా కలకలం.. నిన్న ఖర్గే..నేడు ప్రియాంక
-
Movies News
Alitho Saradaga: ఆమె రాసిన ఉత్తరం కంటతడి పెట్టించింది : యువహీరో నిఖిల్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Road Accident: టైరు పేలి బోల్తాపడిన కారు.. నలుగురి దుర్మరణం
-
Ts-top-news News
Hyderabad: ఆ ట్వీట్‌తో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!