Mumbai vs Lucknow: రాణించిన కేఎల్‌ రాహుల్‌-పూరన్‌.. ముంబయి లక్ష్యం 215

ఐపీఎల్‌ 17లో భాగంగా ముంబయితో జరుగుతోన్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ముగిసింది.

Updated : 17 May 2024 21:47 IST

ముంబయి: ఐపీఎల్‌ 17లో భాగంగా ముంబయితో జరుగుతోన్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(55), పూరన్‌(75) అర్ధశతకాలతో రాణించారు. ముంబయి బౌలర్లలో నువాన్‌ తుషార, పీయుష్‌ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు.

మొదటి నుంచి ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో పవర్‌ప్లే(తొలి 6 ఓవర్లు)లో లఖ్‌నవూ 2 వికెట్లు కోల్పోయి 49 పరుగులే చేసింది. తొలి ఓవర్‌లోనే తుషార బౌలింగ్‌లో పడిక్కల్‌ వికెట్ల ముందు దొరికి డకౌట్‌ అయ్యాడు. ఓ వైపు కెప్టెన్‌ రాహుల్‌ క్రీజులో నిలదొక్కుకొని అర్ధశతకం సాధించాడు. పూరన్‌ (8 సిక్సులు, 5 ఫోర్లు) చెలరేగి ఆడాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు(36)సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్టాయినిస్‌(28), ఆయుష్‌ బదోనీ(22*) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో దీపక్‌(11), అర్హద్‌ ఖాన్‌(0), కృనాల్‌పాండ్య(12*) పరుగులు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని