Nani - Dasara: టీమ్ ఇండియా స్టార్‌లకు పేర్లు పెట్టిన నాని.. ఎవరికేం పేరు ఇచ్చాడంటే?
విశాఖపట్నంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియాల వన్డే మ్యాచ్(Ind vs Aus 2nd ODI)కు యువ హీరో నాని (Nani) ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లకు కొన్ని పేర్లు పెట్టాడు.
విశాఖపట్నం: ‘ధరణి’ అవతారం ఎత్తి ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాడు నాని. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘దసరా’ (Dasara Movie) సినిమా ఆ రోజే వస్తోంది మరి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని ఆదివారం విశాఖపట్నం వచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే ప్రారంభానికి ముందు కాసేపు సందడి చేశాడు. మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, ఎమ్మెస్కే ప్రసాద్, ఆరోన్ ఫించ్‌తో మాట్లాడాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు నాని.
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్‌కు ‘దసరా’లోని ‘ధూమ్ ధామ్..’ సిగ్నేచర్ స్టెప్‌ను నాని నేర్పించాడు. ఇద్దరూ కలసి ఆ స్టెప్ వేసేసరికి స్టేడియంలో ఈలలు మోగిపోయాయి.
- తెలుగు కామెంటరీ టీమ్‌తో మాట్లాడుతూ తన సినిమాల పేర్లు ఏ క్రికెటర్లకు బాగుంటాయి అనే విషయాన్ని సరదాగా చెప్పాడు నాని. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ‘జెంటిల్‌మెన్’ టైటిల్ ఇచ్చాడు.
- కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ఇచ్చిన నాని, హార్దిక్ పాండ్య (Hardik Pandya)కి ‘పిల్ల జమిందార్’ టైటిల్ బాగుంటుందన్నాడు.
- ఇక బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్నకు ... సచిన్ తెందుల్కర్ (Sachin Tendulkar) అని చెప్పాడు. సచిన్ ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అని, అతను ఔట్ అయ్యాడు అనగానే టీవీలు ఆపేసేవాళ్లం అని చెప్పాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Navjot Singh: సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ‘ఇక వేచి ఉండలేనంటూ’ ట్వీట్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
MLC Elections: వైకాపా పతనం ప్రారంభమైంది: తెదేపా శ్రేణులు