Virat - Naveen ul: ఆర్‌సీబీ ఎలిమినేట్.. నవీనుల్‌ హక్‌ ఇన్‌స్టా స్టోరీ వైరల్!

ఐపీఎల్ 2023 సీజన్‌లో(IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కథ ముగిసింది. ప్లేఆఫ్స్‌కు చేరాలనే ఆశలకు గుజరాత్ టైటాన్స్‌ అడ్డుకట్ట వేసింది. విరాట్ సెంచరీ సాధించినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో లఖ్‌నవూ ఆటగాడు నవీనుల్‌ హక్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 22 May 2023 10:36 IST

ఇంటర్నెట్ డెస్క్: స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించినా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు (RCB) ఓటమి తప్పలేదు. గుజరాత్‌ యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ కూడా శతకం బాది ఆర్‌సీబీని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బెంగళూరు లీగ్‌ స్టేజ్‌కే పరిమితమై ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ ఆటగాడు నవీనుల్‌ హక్‌ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ వైరల్‌గా మారింది. మే 9న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ త్వరగా పెవిలియన్‌కు చేరాడు. ఆ సంఘటనపై నవీనుల్‌ హక్‌ ‘స్వీట్ మ్యాంగోస్’అంటూ పోస్టు చేశాడు. 

ఇప్పుడు ఐపీఎల్ 2023 సీజన్‌ నుంచి బెంగళూరు ఎలిమినేట్ కావడం.. అంతకుముందు లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లడంతో నవీనుల్‌ చేసిన పోస్టుకు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో లఖ్‌నవూ-బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా విరాట్, నవీనుల్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి బెంగళూరు మ్యాచ్‌లకు సంబంధించి మరీ ముఖ్యంగా విరాట్‌ను ఉద్దేశించి నవీనుల్‌ హక్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. దీంతో కోహ్లీ అభిమానులు తీవ్రంగా స్పందించారు. 

‘‘నవీనుల్ హక్‌ తన పరిధులను అతిక్రమించాడు’’ 

‘‘ఇదే నవీనుల్‌కు చివరి ఐపీఎల్‌ సీజన్‌’’ 

‘‘విరాట్ కోహ్లీ కనీసం రెండు సెంచరీలు అయినా సాధించాడు. నవీనుల్‌ హక్‌ ఏం చేశాడు..?’’

‘‘నవీనుల్‌కు తన కామెంట్‌ సెక్షన్‌ను టర్న్‌ఆన్‌ చేయమని ఎవరైనా చెప్పండి ప్లీజ్‌..’’

‘‘రోహిత్ సేన తర్వాతి మ్యాచ్‌లో నవీనుల్‌ హక్‌ ఐపీఎల్‌ కెరీర్‌ను ముగిస్తుందిలే!’’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని