Deep Grace: దీప్‌ గ్రేస్‌కు ₹50లక్షల రివార్డు ప్రకటించిన ఒడిశా సీఎం

హాకీ క్రీడాకారిణి దీప్‌గ్రేస్‌ ఎక్కాకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ₹50లక్షల రివార్డు ప్రకటించారు.

Published : 08 Oct 2023 18:37 IST

భువనేశ్వర్‌: భారత హాకీ క్రీడాకారిణి దీప్‌ గ్రేస్‌ ఎక్కాకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నగదు రివార్డును ప్రకటించారు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియన్‌ క్రీడల్లో మహిళల హాకీలో భారత్‌ కాంస్య పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఆమెకు రూ.50లక్షల నగదు రివార్డు అందజేయనున్నట్టు వెల్లడించారు. 28 ఏళ్ల దీప్‌ గ్రేస్‌ ఒడిశా యువతకు ఆదర్శంగా నిలిచారన్న సీఎం.. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చారంటూ ప్రశంసించారు. సుందర్‌గఢ్‌ జిల్లా లుల్కిదిహి గ్రామానికి చెందిన దీప్‌ గ్రేస్‌  దేశంలోని ఔత్సాహిక అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. తన అద్భుతమైన ఆట తీరుతో భారతదేశం గర్వపడేలా చేస్తున్నారని.. మున్ముందు ఇదే స్ఫూర్తి, పట్టుదలను ప్రదర్శించాలని ఆశిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. దీప్‌ గ్రేస్‌ 2011లో అర్జెంటీనాలో జరిగిన నాలుగు దేశాల టోర్నమెంట్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని