T20 World Cup: పాక్‌కు ఇక కష్టమే..

పాక్‌కు ఇక కష్టమే. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆ జట్టు గ్రూప్‌ దశలోనే టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. పాకిస్థాన్‌ తన తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

Updated : 10 Jun 2024 12:43 IST

పాక్‌కు ఇక కష్టమే. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆ జట్టు గ్రూప్‌ దశలోనే టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. పాకిస్థాన్‌ తన తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇంకా అమెరికా, కెనడాలతో ఆడాల్సివున్న రోహిత్‌సేన.. గ్రూప్‌-ఏ నుంచి అగ్రస్థానంతో సూపర్‌-8 చేరడం దాదాపుగా లాంఛనమే. పాక్‌ రేసులో ఉండాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో (కెనడా, ఐర్లాండ్‌లతో) తప్పక నెగ్గాలి. అదే సమయంలో అమెరికా మిగతా రెండు మ్యాచ్‌ల్లో (భారత్, ఐర్లాండ్‌లతో) ఓడిపోవాలి. పాక్‌ రెండూ గెలిచి, అమెరికా రెండూ ఓడితే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐర్లాండ్‌.. ఒకటి గెలిచి, ఒకటి ఓడిన కెనడా కూడా ఇంకా రేసులో ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని