Rishabh Pant: విమానాశ్రయానికి వెళ్లడానికి భయపడ్డా

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను.. జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ తెలిపాడు.

Updated : 29 May 2024 08:26 IST

దిల్లీ: ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను.. జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ తెలిపాడు. 2022 డిసెంబరులో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌.. చాలా కాలం ఆటకు దూరమై, రెండు నెలల కిందట ఐపీఎల్‌తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఆ ప్రమాదం నా జీవితాన్నే మార్చేసిన అనుభవం. బతుకుతానని కూడా అనుకోలేదు. కానీ దేవుడు దయతలిచాడు’’ అని శిఖర్‌ ధావన్‌ టాక్‌షోలో పంత్‌ చెప్పాడు. ‘‘నేను విమానాశ్రయానికి వెళ్లలేకపోయా. చక్రాల కుర్చీలో జనానికి కనపడడానికి భయపడ్డా. రెండు నెలల పాటు కనీసం పళ్లు తోముకోలేకపోయా. ఏడు నెలల పాటు భరించలేని నొప్పితో బాధపడ్డా’’ పంత్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని