IND vs AUS: ఇది 1980, 90ల నాటి పిచ్‌లా ఉంది.. భారత మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ పిచ్‌పై టీమ్ఇండియా (Team India) మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా భారత్,ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైంది. మొదటి మూడు టెస్టుల్లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉన్న విషమం తెలిసిందే. నాలుగో టెస్టుకు మాత్రం పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. మొదటి రోజు ఆటను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తొలి రోజు వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లు చాలా కష్టపడ్డారు. చివరకు నాలుగు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (104*), కామెరూన్ గ్రీన్ (49*) క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పిచ్ గురించి భారత మాజీ క్రికెటర్, మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇలాంటి పిచ్‌పై తొలి సెషన్లో రెండు వికెట్లు పడగొట్టడం గొప్ప విషయం. చాలాకాలంగా మనం ఇలాంటి పిచ్‌ను చూడలేదు. 1970, 80ల నాటి పిచ్‌లాగా కనిపిస్తున్న ఈ పిచ్‌పై మొదటి సెషన్లో భారత్ రెండు వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబర్చింది. అయితే, మొత్తంమ్మీద భారత బౌలర్లు వికెట్లు వచ్చే విధంగా బౌలింగ్ చేయలేదు’ అని మంజ్రేకర్ అన్నాడు. మరో కామెంటేటర్ మాథ్యూ హెడెన్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించాడు. టెస్టు క్రికెట్‌కు ఈ పిచ్ ఉత్తమమైనదని, ఇటు బ్యాటర్లకు.. అటు బౌలర్లకు అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్‌కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్‌లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్‌లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్‌లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్‌ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్‌లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్‌బీర్