Punjab Vs Delhi: తొలి మ్యాచ్‌లో ‘పంజా’బ్‌ విసిరింది.. దిల్లీపై సూపర్‌ విక్టరీ

ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ మెరిసింది. దిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 23 Mar 2024 19:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ మెరిసింది. దిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సామ్‌ కరన్‌ (63; 47 బంతుల్లో 6×4, 1×6) అర్ధ శతకం బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శిఖర్‌ ధావన్‌ (22), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (26) పరుగులు చేశారు. బెయిర్‌ స్టో (9), జితేశ్ శర్మ(9) విఫలమయ్యారు. లివింగ్‌స్టోన్‌ (38*; 2×4, 3×6)), హర్‌ప్రీత్‌ బ్రర్‌ (2*) నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్‌ (29), మిచెల్ మార్ష్ (20) శుభారంభం అందించారు. వన్‌డౌన్‌ బ్యాటర్ షై హోప్‌ (33) రాణించాడు. 15 నెలల తర్వాత బ్యాట్ పట్టిన రిషభ్‌ పంత్‌ (18) పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అభిషేక్ పొరెల్ (32; 10 బంతుల్లో) చెలరేగి ఆడాడు. అతడు వరుసగా 4,6,4,4,6 బాదాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, హర్షల్‌ పటేల్ 2, రబాడ, హర్‌ప్రీత్‌ బ్రార్‌, రాహుల్ చాహర్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని