PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ ఫైనల్లో సింధు

సూపర్‌ సిరీస్‌ టైటిళ్ల కరవు తీర్చుకునేందుకు.. రెండేళ్లలో తొలి టైటిల్‌ సొంతం చేసుకునేందుకు భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు కావాల్సింది మరొక్క విజయమే. మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగమ్మాయి ఫైనల్లో అడుగుపెట్టింది.

Updated : 26 May 2024 09:34 IST

కౌలాలంపూర్‌: సూపర్‌ సిరీస్‌ టైటిళ్ల కరవు తీర్చుకునేందుకు.. రెండేళ్లలో తొలి టైటిల్‌ సొంతం చేసుకునేందుకు భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు కావాల్సింది మరొక్క విజయమే. మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలుగమ్మాయి ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం సెమీస్‌లో అయిదో సీడ్‌ సింధు 13-21, 21-16, 21-12 తేడాతో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)పై చెమటోడ్చి నెగ్గింది. 88 నిమిషాల పాటు సాగిన ఈ పోరు ఫిట్‌నెస్‌కు పరీక్షగా మారింది. తొలి గేమ్‌ ఓడిన సింధు రెండో గేమ్‌లో తనదైన శైలిలో దూసుకెళ్లింది. 4-6తో వెనుకబడ్డ దశలో గొప్ప పోరాటంతో పోటీలోకి వచ్చింది. ఎదురుదాడితో 18-14తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగించి గేమ్‌ దక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు మరింత దూకుడుగా ఆడి విజయాన్ని అందుకుంది. ఆదివారం ఫైనల్లో రెండోసీడ్‌ వాంగ్‌ జి యి (చైనా)తో సింధు తలపడుతుంది. బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన భారత షట్లర్‌గా సింధు (453) నిలిచింది. సైనా(451)ను అధిగమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని