Ravindra Jadeja : జడ్డూతో రాపిడ్‌ఫైర్‌ రౌండ్‌.. టీమ్‌ఇండియాలో డీజే ఎవరు..? బెస్ట్‌ స్లెడ్జర్‌ ఎవరు..?

సరదా ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానమిచ్చాడు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ జడేజా (Ravindra Jadeja). రాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌ అతడు చెప్పిన సమాధానాలివే..

Updated : 01 Jul 2023 11:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియాలో ఎవరు ఫన్నీగా ఉంటారు, సోషల్‌ మీడియాలో రీల్‌ కింగ్‌ ఎవరు? భలేగా ఉన్నాయి కదా ఈ ప్రశ్నలు. అచ్చంగా ఇలాంటి ప్రశ్నలకే భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటన పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ పాత వీడియో వైరల్‌గా మారింది. అందులోని ఆసక్తికర ప్రశ్నలు, సమాధానాలు మీ కోసం. 

* టీమ్‌ఇండియాలో ఎవరికి మంచి గడ్డం ఉంది..?
నా గడ్డం కూడా బాగానే ఉంటుంది. అయితే.. విరాట్‌, కేఎల్‌ రాహుల్‌ మంచి గడ్డం కలిగి ఉన్నారు.

* మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ గేమర్‌..?

పుజారా

* ఫన్నీయెస్ట్‌ వాట్సాఫ్‌ ఫార్వర్డర్‌..?

ఇషాంత్‌ కిషన్‌. మా ప్రాక్టీస్‌ సెషన్‌ను అతడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా చేస్తాడు.

* టీమ్‌ఇండియాలో బెస్ట్‌ స్లెడ్జర్‌ ఎవరు?

విరాట్‌ కోహ్లీ. ఇందులో కోహ్లీయే బెస్ట్‌. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటాడు. ప్రత్యర్థి ముఖం మీదే తిరిగి ఇచ్చేస్తాడు.

* విరాట్‌, రోహిత్‌లో ఎవరు ఫన్నీగా ఉంటారు..?

కోహ్లీయే. టీమ్‌లో ఇతరులను అనుకరిస్తూ ఆటపట్టిస్తుంటాడు. రోహిత్‌ కూడా ఫన్నీగానే ఉంటాడు.

* టీమ్‌లో డీజే ఎవరు..?

విరాట్‌. అన్ని తరాల ప్లేలిస్ట్‌ అతడి వద్ద ఉంటుంది. కోహ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రాగానే మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేస్తాడు.

* ఎవరు తొందరగా రిప్లై ఇస్తారు..?

చాహల్‌.

* జట్టులో రీల్‌ కింగ్‌ ఎవరు..?

మాకు ఇద్దరు ఉన్నారు. చాహల్‌, శిఖర్‌ ధావన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని