Ravi Shastri: గంగూలీ సహా దిల్లీ డగౌట్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

వరుసగా ఐదు మ్యాచుల్లోనూ ఓడిపోయిన దిల్లీ క్యాపిటల్స్ (DC) పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. క్రికెట్‌ దిగ్గజాలు జట్టుతోపాటు ఉన్నప్పటికీ.. విజయాలు మాత్రం దక్కడంలేదు.

Published : 16 Apr 2023 14:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో రికీ పాంటింగ్‌, సౌరభ్‌ గంగూలీ దిగ్గజ క్రికెటర్లు. వీరిద్దరూ కలిసి డేవిడ్‌ వార్నర్‌ నాయకత్వంలోని దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం ఐపీఎల్ 16వ సీజన్‌లో (IPL 2023) ఇప్పటి వరకు ఒక్క విజయం చేకూర్చలేకపోయారు. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తాజాగా బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. దీంతో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి మాత్రం  దిల్లీ ఫ్రాంచైజీ, గంగూలీ సహా ఇతర కోచింగ్‌ సిబ్బందిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు - దిల్లీ మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లో రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 

‘‘ఇతర జట్లు విజయాలతో ముందుకు సాగుతున్న వేళ.. దిల్లీ క్యాపిటల్స్‌ మాత్రం ఒక్క గెలుపు కోసం పోరాడాల్సి వస్తోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయిన జట్టు తిరిగి పుంజుకోవాలంటే మాత్రం కష్టమే. దిల్లీ డగౌట్‌లో ఉండే వారికి కూడా ఓడిపోవడం ఇష్టం ఉండదు. అందులో రికీ పాంటింగ్‌, డేవిడ్‌ వార్నర్, గంగూలీ.. వీరెవరికీ ఓడిపోవడం నచ్చదు. మ్యాచ్‌ చివరి వరకూ పోరాడి మరీ దిల్లీ మ్యాచ్‌లను చేజార్చుకుంది. ఇది వారికి సంతోషించే అంశం కాదు. కానీ, మ్యాచ్‌ మ్యాచ్‌కు కాస్త మెరుగు కావడం మాత్రం ముందడుగు లాంటిదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ భావిస్తాడనుకుంటా’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని