Virat - Ganguly: విరాట్ - గంగూలీ ‘షేక్‌హ్యాండ్’ వివాదం.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం కొత్త చర్చకు దారితీసింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ, డీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా వీరిద్దరూ కరచాలనం ఇచ్చుకునేందుకు ఇష్టపడకపోవడంతో సోషల్‌ మీడియాలో ఈ అంశం వైరల్‌గా మారింది. 

Published : 23 Apr 2023 14:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్‌లో (IPL 2023) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే, ఓ సంఘటన మాత్రం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్లు సౌరభ్‌ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వాడీవేడీ వాతావరణం ఒక్కసారిగా ఐపీఎల్‌ను వార్తల్లో నిలిచేలా చేసింది. దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs DC) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా గంగూలీకి కరచాలనం చేసేందుకు విరాట్ కోహ్లీ విముఖత ప్రదర్శించాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. 

‘‘ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. ఒకరేమో (X ప్లేయర్) టీమ్‌ఇండియా గొప్ప ఆటగాడు. మాజీ కెప్టెన్. దిగ్గజం. మరొక ఆటగాడు (Y ప్లేయర్) కూడా భారత్‌కు చెందిన గొప్ప ఆటగాడే. మాజీ కెప్టెన్‌ అయిన ఆ ప్లేయర్ ఇంకా ఆడుతున్నాడు. ఇప్పుడు X ఓ జట్టును నడిపిస్తున్నాడు. Y అనే ఆటగాడు తన జట్టు కోసం అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరిపై మరొకరు అయిష్టతను ప్రదర్శిస్తున్నారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా కరచాలనం చేసుకొనేందుకు వచ్చారు. అయితే, X, Y మాత్రం షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. వారిద్దరూ మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు వారికి ఏమైనా సలహాలు ఇస్తారా? అని అడుగుతుంటారు. అయితే, నాకున్న రిలేషన్స్‌ ఆధారంగానే మాట్లాడతా. నేను మాట్లాడకూడదనుకుంటే దాటవేస్తాను’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని