Ravindra jadeja: సీఎస్‌కేకు మద్దతు ఇవ్వండి.. గుజరాత్‌ అభిమానులకు జడేజా విజ్ఞప్తి

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (GT vs CSK) తొలి మ్యాచ్‌లో తలపడనుంది. సీఎస్‌కే స్టార్‌ ఆటగాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆడబోతుండటం విశేషం.

Published : 31 Mar 2023 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌ (IPL 2023) 16వ సీజన్‌ టోర్నీకి సిద్ధమైపోయాడు. ఇప్పటికే జట్టు సభ్యులతో ప్రాక్టీస్‌ చేసిన జడ్డూ (Ravindra Jadeja) తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌పైనా ప్రత్యేకంగా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నైసూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీ యూట్యూబ్‌లో విడుదల చేసింది. తమ జట్టుకు మద్దతు ఇవ్వాలని గుజరాత్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 

‘‘కొవిడ్‌ తర్వాత భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య ఆడుతున్న తొలి సీజన్‌ ఇదే కావడం విశేషం. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మ్యాచ్‌లను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స్టేడియాల్లో ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అతి పెద్ద మైదానంలో ఆడబోతుండటం మరింత ఉత్సాహంగా ఉంది. అయితే, గుజరాత్‌లోని సీఎస్‌కే అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ వచ్చి   చెన్నైజట్టుకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఈ మైదానంలో ఇటీవలే ఆసీస్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడిన అనుభవం ఉంది. అప్పుడు భారీగానే అభిమానులు మ్యాచ్‌ కోసం వచ్చారు. హోం గ్రౌండ్‌లో సొంత జట్టుకు మద్దతుగా  అభిమానులు వస్తుంటారు. అలా ఉండటం కూడా గర్వకారణం. అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్‌కు మాత్రం గుజరాత్‌ అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్‌కు సపోర్ట్‌ చేయాలని కోరుతున్నా’’ అని జడేజా తెలిపాడు. అయితే.. గుజరాత్‌తో తొలి మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడటం ఇంకా అనుమానంగానే ఉంది. ధోనీ లేకపోతే.. జడ్డూ నాయకత్వం వహించే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు