Virat Kohli: విరాట్ కోహ్లీకి గాయం.. అప్‌డేట్ ఇచ్చిన ఆర్సీబీ హెడ్ కోచ్‌

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ క్యాచ్‌ను అందుకునే క్రమంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) గాయపడిన సంగతి తెలిసిందే. కోహ్లీ గాయంపై ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అప్‌డేట్ ఇచ్చాడు.

Published : 22 May 2023 22:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్‌ సెంచరీ బాదినా ఆర్సీబీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. కోహ్లీ ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టాడు. విజయ్‌ శంకర్‌ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న తర్వాత మోకాలి నొప్పితో విరాట్ విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన అనంతరం కోహ్లీ కుంటుతూ మైదానాన్ని వీడాడు. చివరి ఐదు ఓవర్ల ఆటను డగౌట్‌లో కూర్చొని వీక్షించాడు. దీంతో విరాట్ గాయంపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ గాయంపై ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్ అప్‌డేట్ ఇచ్చాడు. 

‘‘కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కానీ, అది తీవ్రమైనది కాదనుకుంటున్నా. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అతను బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ జట్టుకు తన వంతు సహకారం అందించాలనుకునే వ్యక్తి.  సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 40 ఓవర్లు, ఆఖరి మ్యాచ్‌ (గుజరాత్‌తో)లో 35 ఓవర్ల పాటు కోహ్లీ మైదానంలో ఉన్నాడు. అతను తన బెస్ట్ ఇస్తున్నాడు. అతడికి తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని భావిస్తున్నాను’’ అని సంజయ్ బంగర్ అన్నాడు. గుజరాత్‌పై ఓటమితో ఆర్సీబీ లీగ్‌ దశలో టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని