Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌.. ఆ ఎల్బీ నాటౌటా?

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సమీక్షలో దినేశ్‌ కార్తీక్‌ ఎల్బీ నాటౌట్‌గా తేలడం వివాదాస్పదమైంది. 15వ ఓవర్‌ రెండో బంతికి రజత్‌ను అవేశ్‌ ఔట్‌ చేశాడు.

Published : 23 May 2024 09:10 IST

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సమీక్షలో దినేశ్‌ కార్తీక్‌ ఎల్బీ నాటౌట్‌గా తేలడం వివాదాస్పదమైంది. 15వ ఓవర్‌ రెండో బంతికి రజత్‌ను అవేశ్‌ ఔట్‌ చేశాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన దినేశ్‌ బంతిని డిఫెండ్‌ చేద్దామని చూడగా అది ప్యాడ్లకు తాకింది. అప్పీల్‌ చేస్తే మైదానంలోని అంపైర్‌ ఔటిచ్చాడు. వెంటనే దినేశ్‌ సమీక్ష కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్‌ రావడంతో టీవీ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ అది బంతి బ్యాట్‌కు తాకితే రాలేదని, ప్యాడ్‌కు బ్యాట్‌ తాకితే వచ్చిందని రాజస్థాన్‌ ఆటగాళ్లు, ఆ ఫ్రాంఛైజీ క్రికెట్‌ డైరెక్టర్‌ సంగక్కర అసహనం వ్యక్తం చేశారు. రీప్లేలో కూడా బంతి, బ్యాట్‌ మధ్య ఖాళీ కనిపించింది. వ్యాఖ్యాత గావస్కర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ అవకాశాన్ని దినేశ్‌ వృథా చేశాడు. అతను 13 బంతుల్లో 11 పరుగులే చేసి ఔటవడం ఆర్సీబీకి నష్టమే చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని