Rinku Singh: ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో రింకు సింగ్‌పై ప్రశ్న.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన కలను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు అతడి పేరు ఓ ప్రముఖ షోలో మాట్లాడుకునే స్థాయికి చేరింది.

Updated : 19 Aug 2023 14:14 IST

(ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రింకు సింగ్‌ (Rinku Singh) తాజాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌  సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టేసిన రింకు ఐర్లాండ్‌తో సిరీస్‌తోపాటు ఆసియా గేమ్స్‌ కోసం ప్రకటించిన జట్టులోనూ స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో ఓ ప్రశ్న రూపంలో రింకు సింగ్‌ వచ్చేశాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ‘ఘూమర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ కేబీసీలో పాల్గొంది. అభిషేక్ బచ్చన్, సయామీ ఖెర్‌తోపాటు డైరెక్టర్‌ ఈ షోకు వచ్చారు. 

‘ఘూమర్‌’ చిత్ర యూనిట్‌కు హోస్ట్‌ అమితాబ్‌ బచ్చన్ ఓ ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్నకు కరెక్ట్‌గా సమాధానం చెబితే రూ. 6.40లక్షలను గెలుచుకొనే అవకాశం ఉంటుంది. ‘‘ఐపీఎల్ 2023 సీజన్‌ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన ఏ ఆటగాడు వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టాడు?’’ అనే ప్రశ్నకు ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, నితీశ్‌ రాణా, వెంకటేశ్‌ అయ్యర్.. నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుందిగా.. ఆ బ్యాటర్‌ రింకు సింగ్‌. ఇటీవల ముగిసిన సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్స్‌లు బాది కోల్‌కతాను గెలిపించాడు. మరి ఆ చిత్ర యూనిట్‌ సమాధానం కరెక్టుగా చెప్పిందో లేదో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని