Rohit Sharma: ఒత్తిడిని తట్టుకోవడం ప్రత్యేకంగా ఎవరికీ నేర్పించలేం: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటికి వచ్చేసింది. ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఒత్తిడి ఉండే సెమీఫైనల్‌ వంటి పోటీల్లో నిలకడగా రాణించడం అత్యంత కీలకం. ఇదే విషయం కెప్టెన్‌ రోహిత్ శర్మ వెల్లడించాడు.

Published : 11 Nov 2022 01:20 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లాండ్‌ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (80*), అలెక్స్ హేల్స్ (86*) అద్భుతమైన అర్ధశతకాలతో ఇంగ్లాండ్‌ను గెలిపించారు. దీంతో సెమీస్‌ నుంచి టీమ్‌ఇండియా ఇంటిముఖం పట్టింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. 

‘‘ఇవాళ మ్యాచ్‌ ఫలితం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. బ్యాటింగ్‌ ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం తేలిపోయాం. ఇక్కడి పిచ్‌ బౌలింగ్‌కు సహకరించలేదు. అయినా 16 ఓవర్లలోనే లక్ష్య ఛేదన చేయడం బాధాకరమే. బంతితో మేం రాణించలేకపోయాం. నాకౌట్ స్టేజ్‌లో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అద్భుతమే కానీ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో ప్రత్యేకంగా నేర్పించలేం. భారత టీ20 లీగ్‌లో ప్లేఆఫ్స్‌, అధిక ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లను ఎన్నో ఆడారు. వారే స్వతహాగా అలవాటు చేసుకోవాలి. మేం బ్యాటింగ్‌ చేసేటప్పుడు బంతి సరిగ్గా బ్యాట్‌కు రాలేదు. కానీ ఇంగ్లాండ్‌ ఓపెనర్లు మాత్రం బాగా ఆడారని మాత్రం చెప్పగలను. భువనేశ్వర్‌ కుమార్‌ తొలి ఓవర్‌ వేసేటప్పుడు స్వింగ్‌ ఉంది. కానీ సరైన ప్రాంతాల్లో బంతులను సంధించలేదు. స్క్వేర్‌ ప్రదేశంలో ఈజీగా పరుగులు వస్తాయని మాకు తెలుసు. అందుకే అటువైపు కొట్టకుండా చూద్దామని ప్రయత్నించాం. అది కుదరలేదు’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని