Ruturaj Gaikwad: రెండు రోజుల్లో పెళ్లి.. రుతురాజ్ గైక్వాడ్ ఫియాన్సీ ఎవరంటే..?
టీమ్‌ఇండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj) ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలో అతడికి కాబోయే భార్య ఎవరా..? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. సీఎస్‌కేలోని ఆటగాళ్లంతా తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో మ్యాచ్‌ను చూసేందుకు హాజరయ్యారు. విజేతగా నిలిచిన తర్వాత ధోనీతో ఫొటోలూ దిగారు. ధోనీ, రవీంద్ర జడేజా, డేవన్ కాన్వే, సాంట్నర్, అజింక్య రహానె, దీపక్ చాహర్.. ఇలా తమ సతీమణులతో అభిమానులను అలరించారు. ఈ క్రమంలో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కూడా తన ఫియాన్సీతో కలిసి సందడి చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ మారిపోయాడు. మరో రెండు రోజుల్లో ఆమెతో రుతురాజ్‌కు వివాహం కూడా జరగనుంది. దీంతో ఆమె ఎవరు...? అని నెటిజన్లు సెర్చింగ్ మొదలుపెట్టారు.
రుతురాజ్ గైక్వాడ్‌కు కాబోయే సతీమణి పేరు ఉత్కర్ష పవార్ (Utkarsha Pawar). ఈ 24 ఏళ్ల యువతి మహారాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ కూడా ఆడటం విశేషం. రుతురాజ్ మాదిరిగా కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ కూడా చేయగల ఆల్‌రౌండర్. అయితే, గత 18 నెలల నుంచి ఆమె క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, ఫిట్‌నెస్ సైన్స్ (INFS)లో చదువుకుంటున్నారు. రుతురాజ్ - ఉత్కర్ష వివాహం జూన్ 3వ తేదీన జరగనుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు స్టాండ్‌బైగా ఉన్న రుతురాజ్ అందుబాటులో ఉండనని బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్