Sachin Tendulkar : యువీ, కుంబ్లేలతో కలిసి ‘దిల్ చాహతా హై’ను రీక్రియెట్ చేసిన సచిన్..
వాళ్లంతా ఒకప్పటి క్రికెట్ దిగ్గజాలు. ఇటీవల గోవాలో సరదాగా గడిపారు. తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎంత గొప్పదో వివరిస్తూ ఒకప్పటి బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని గుర్తు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్ : క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) తన సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా గడిపాడు. తన మిత్రులైన యువరాజ్ సింగ్(Yuvraj Singh), అనిల్ కుంబ్లే(Anil Kumble)లతో కలిసి గోవా(Goa)లో ఎంజాయ్ చేశాడు. వారితో ఫొటోలు దిగి ‘దిల్ చాహతా హై’(Dil Chahta Hai) క్షణాన్ని రీక్రియెట్ చేశాడు.
గోవాలోని ఓ ప్రాంతంలో కుంబ్లే సెల్పీ తీస్తుండగా.. సచిన్, యువీ పక్కనే నిల్చున్నారు. ఈ ఫొటోను సచిన్ ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘‘గోవాలో ఇది మా ‘దిల్ చాహతా హై’ క్షణం. మాలో ఆకాశ్, సమీర్, సిధ్ అని మీరు ఎవరిని అనుకుంటున్నారు?’’ అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చాడు. 2001 నాటి బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘దిల్ చాహతా హై’లో ఆమిర్ ఖాన్ ఆకాశ్‌గా, సైఫ్ అలీ ఖాన్ సమీర్‌గా, అక్షయ్ ఖన్నా సిధ్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ నటులతో పోల్చుతూ సచిన్ తమ చిత్రాన్ని షేర్ చేశాడు.
ఇక కుంబ్లే, సచిన్, యువరాజ్ 2003 వన్డే ప్రపంచకప్‌లో కలిసి ఆడగా.. సచిన్, యువీ 2011లో భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
లండన్‌లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య..కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
-
Politics News
Panchumarthi Anuradha : చంద్రబాబును కలిసిన పంచుమర్తి అనురాధ
-
General News
CAG: రూ.6,356 కోట్లు మురిగిపోయాయి: ఏపీ ఆర్థికస్థితిపై కాగ్ నివేదిక
-
Movies News
Venkatesh: ఇప్పుడు టర్న్ తీసుకున్నా.. ‘రానా నాయుడు’పై వెంకటేశ్ కామెంట్
-
Sports News
IPL:ఆటగాళ్ల పనిభార నిర్వహణ.. అవసరమైతే ఐపీఎల్లో ఆడటం మానేయండి: రవిశాస్త్రి
-
General News
Hyderabad : విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా.. ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్