Sania Mirza: సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. ఎల్బీ స్టేడియంలో సందడి

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా(Sania Mirza) ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా.. 

Updated : 05 Mar 2023 14:04 IST

హైదరాబాద్‌: భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా(Sania Mirza) ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్‌ ఆడుతోంది. డబుల్స్‌ మ్యాచ్‌ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరుగుతోంది. సింగిల్స్‌లో రోహన్‌ బోపన్నతో సానియా తలపడనుంది. సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌ తదితరులు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. 

ఈ సందర్భంగా అజారుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ సానియా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని చెప్పారు. క్రీడా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరముందని ఆయన ఆభిప్రాయపడ్డారుర. మహిళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు.

మ్యాచ్‌ అనంతరం సాయంత్రం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌, గాలా డిన్నర్‌ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్‌కు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్‌బాబు, ఏఆర్‌ రెహమాన్‌, సురేష్‌రైనా, జహీర్‌ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు హాజరుకానున్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని