Jasprit Bumrah: బుమ్రా తన ఫిట్‌నెస్ కోసం మరింత శ్రమించాలి: సంజయ్ మంజ్రేకర్

ఇంటర్నెట్ డెస్క్: భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తన ఫిట్‌నెస్ కోసం మరింత శ్రమించాలని టీమ్‌ఇండియా (Team India) మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సూచిస్తున్నాడు. తాజాగా అతడు ఇంగ్లాండ్ టూర్‌లో అయిదు టెస్టులకు గాను, కేవలం మూడింట్లోనే ఆడిన విషయాన్ని మంజ్రేకర్ ప్రస్తావించాడు. ప్రస్తుతం బుమ్రా.. వరుసగా రెండు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడలేని నేపథ్యంలో, సెలెక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అతడు విశ్లేషించాడు. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా ఆడని మ్యాచుల్లోనే టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయాన్నీ అతడు గుర్తు చేశాడు.
‘మనం కొన్ని విషయాలను ఎంత దాచాలని ప్రయత్నించినా.. దాగవు. వాస్తవాలు వేరుగా ఉంటాయి. నిజానికి ఇంగ్లాండ్ టూర్‌లో బుమ్రా ఆడని రెండు మ్యాచుల్లోనే టీమ్‌ఇండియా విజయం సాధించింది. సెలెక్టర్లు ఇకనైనా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సిరీస్ వారికి గొప్ప పాఠంలాంటింది. టీమ్ఇండియా గెలిచిన రెండు టెస్ట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ (Virat Kohli), ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara), రోహిత్ శర్మ (Rohit Sharma), మహమ్మద్ షమీ (Mohammed Shami), బుమ్రా (Jasprit Bumrah) కూడా లేరు’ అని సంజయ్ మంజ్రేకర్.. కుండబద్దలు కొట్టాడు.
అలాగే అతడు సెలెక్టర్లకు పలు సూచనలూ చేశాడు. ‘బుమ్రా వరుసగా రెండు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడలేనప్పుడు, అతణ్ని సెలెక్టర్లు ఎంపిక చేయకూడదు. కులదీప్ యాదవ్ (Kuldeep Yadav) విషయంలో వారు కఠినంగా ఉన్నట్లే ఇతర పెద్ద ఆటగాళ్ల ఎంపికపైనా అలాగే వ్యవహరించాలి’ అని మంజ్రేకర్ సూచించాడు. బుమ్రాకు కూడా అతడు ఓ సలహా ఇచ్చాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రాను నేను అభిమానిస్తా. అయితే పూర్తి ఫిట్‌గా లేనప్పుడు ఆడటం సవాళ్లతో కూడుకున్నదే. అందుకే, బుమ్రా తన ఫిట్‌నెస్ మీద మరింత దృష్టి పెట్టాలి’ అని సంజయ్ మంజ్రేకర్ వివరించాడు.
తెందుల్కర్- అండర్సన్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడిన జస్‌ప్రీత్ బుమ్రా 26.00 యావరేజ్‌తో 14 వికెట్లు తీసుకున్నాడు. రెండు సార్లు అయిదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మొత్తంగా 119.4 ఓవర్లపాటు బౌలింగ్ వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 


