సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

Published : 18 May 2024 03:38 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ నం.3 సాత్విక్‌ ద్వయం 21-7, 21-14తో జునైది ఆరిఫ్, రాయ్‌ కింగ్‌ (మలేసియా)ను ఓడించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తనీషా జంట పోరాడి గెలిచింది. మూడు గేమ్‌ల పాటు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన క్వార్టర్స్‌లో అశ్విని జంట 21-15, 21-23, 21-19తో ఆరో సీడ్‌ లీ యు లిమ్, షెన్‌ సియుంగ్‌ (దక్షిణ కొరియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మీరాబా లువాంగ్‌ మైసనాం పోరాటానికి తెరపడింది. మీరాబా 12-21, 5-21తో నాలుగో సీడ్‌ కున్లావత్‌ వితిసర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయంపాలయ్యాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని