పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు నిజమైన మనుషులే కాదు: వాట్సన్‌

భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ జీవితాన్ని చూసి ప్రేరణ పొందని వారు మనుషులే కాదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు.

Published : 02 Apr 2024 04:48 IST

దిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ జీవితాన్ని చూసి ప్రేరణ పొందని వారు మనుషులే కాదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు. 2022 డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ పంత్‌ 15 నెలల విరామం తర్వాత బ్యాటుతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ‘‘పంత్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం. అందులో అనుమానమే లేదు. తీవ్ర గాయాల పాలైన పంత్‌లో అలాంటి ఇన్నింగ్స్‌ ఆడగలిగిన సామర్థ్యం ఉందనుకోవడం నమ్మకశ్యం కానిదే. పంత్‌ నుంచి ప్రేరణ పొందలేని వారు నిజమైన మనుషులే కాదు. గాడిన పడేందుకు పంత్‌కు కొంచెం సమయం పట్టింది. కానీ ఒక్కసారి లయను అందుకున్నాక తనదైన శైలిలో ‘రిషబ్‌ పంత్‌’ షాట్లు ఆడాడు. అవన్నీ అద్భుతంగా ఉన్నాయి’’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని