Shoaib Akhtar: భారత్,పాక్ మ్యాచ్ గురించి మరోసారి ప్రస్తావించిన షోయబ్ అక్తర్.. కారణమేంటంటే
భారత్, పాక్ మ్యాచ్‌ని ఏ దేశంలో నిర్వహించినా అక్కడి స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయి. ఇండియా,పాక్ మ్యాచ్‌లకున్నంతా క్రేజ్ మిగతా జట్లు ఆడితే ఉండదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాక్ మ్యాచ్‌ని ఏ దేశంలో నిర్వహించినా అక్కడి స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయి. ఇండియా,పాక్ మ్యాచ్‌లకున్నంతా క్రేజ్ మిగతా జట్లు ఆడితే ఉండదు. కొన్ని పెద్ద జట్ల మ్యాచ్‌లకూ ఇదే సమస్య ఎదురవుతోంది. అవును! టీ20 ప్రపంచకప్ ముగిసిన మూడు రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైన నవంబర్ 22న ముగిసింది. ఈ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. ప్రేక్షకులు లేక స్టేడియాలు ఖాళీగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
అయితే, ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆదరణ తగ్గుతోందన్న చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుండగా.. తాజాగా ఆసీస్, ఇంగ్లాండ్ సిరీస్‌తో ఇది మరింత ఊపందుకుంది. ఈ విషయంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆదరణ తగ్గుతోందని, ఈ విషయాన్ని తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం మెల్‌బోర్న్‌లోని అడిలైడ్ వేదికగా జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారని గుర్తు చేశాడు.
‘తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమిది. టీ20 ప్రపంచకప్ ముగిసి కొద్ది రోజులే అవుతోంది. టోర్నీలో ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీ ముగిసిన మూడు రోజుల తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌కు అభిమానులు ఆసక్తి చూపలేదు. అయితే, ఒక నెల క్రితం ఇదే స్టేడియంలో పాక్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌కు 92,000 మంది హాజరయ్యారు’ అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rashmika: బాబోయ్.. ‘సామి సామి’ స్టెప్ ఇక వేయలేను..: రష్మిక
-
Sports News
IND vs PAK: మోదీజీ.. భారత్- పాక్ మధ్య మ్యాచ్‌లు జరిగేలా చూడండి: షాహిది అఫ్రిది
-
India News
Mehul Choksi: మెహుల్ ఛోక్సీ రెడ్‌కార్నర్ నోటీసు రద్దుపై సీబీఐ అప్పీల్..
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
-
World News
Ukraine: క్రిమియాపై ఉక్రెయిన్ దాడి.. రష్యా క్రూజ్ క్షిపణుల ధ్వంసం
-
Sports News
UPW vs DCW: ఆదుకున్న మెక్‌గ్రాత్.. దిల్లీ ముందు మోస్తారు లక్ష్యం