Babar-Akhtar: అప్పుడు బాబర్‌ను వదలకూడదనుకున్నా: అక్తర్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam)తో గతంలో జరిగిన ఓ సంఘటనను షోయబ్ అక్తర్ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో అతడిని కొట్టేంత కోపం వచ్చిందని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) ఇంగ్లిష్‌లో మాట్లాడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటాడు. అతడి కమ్యూనికేషన్ స్కిల్స్ దారుణంగా ఉంటాయనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. మీడియా సమావేశాల్లోనూ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ, బాబర్ అజామ్ గురించి బాగా తెలిసిన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మాత్రం అలాంటి విమర్శలను పట్టించుకోనని చెబుతున్నాడు. అలాగే, బాబర్‌కు కోచింగ్ ఇచ్చిన సమయంలోనూ జరిగిన ఓ సంఘటనను గుర్తు చేశాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా బౌలింగ్ వేసినప్పుడు స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టద్దని చెప్పినా.. అలాగే చేశాడని, కోపం వచ్చిందని పేర్కొన్నాడు.
‘‘అకాడమీలో క్రికెట్ ప్రాక్టీస్ కోసం బాబర్ అజామ్ వచ్చేవాడు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. నెట్ ప్రాక్టీస్ చేయించేందుకు ముదస్సర్ భాయ్ నాకు బాబర్‌ను అప్పగించాడు. నా బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టొద్దని బాబర్‌తో చెప్పా. కానీ, అతడు నేచురల్ ప్లేయర్. అలాగే కొట్టేశాడు. ఒక బంతి అయితే నాకు తాకింది. వెంటనే, నేను నిన్ను వదలిపెట్టే ప్రసక్తే లేదని మనసులోనే అనుకున్నా. అప్పుడే ముదస్సర్ వెంటనే బాబర్‌ను బయటకు వచ్చేయమని చెప్పాడు. లేకపోతే నేను బాల్‌తో కొట్టేస్తానని అతడిని హెచ్చరించాడు’’ అని అక్తర్ చెప్పాడు.
పాక్ యువ వికెట్ కీపర్ అజామ్ ఖాన్‌పై ప్రశంసలు కురిపిస్తూ బాబర్ అజామ్‌పై షోయబ్ అక్తర్ పరోక్షంగా విమర్శలను గుప్పించాడు. ‘‘ఇన్నింగ్స్‌ను నిర్మిచడంలో ఎంతో బాధ్యత కలిగిన ఆటగాడు అజామ్ ఖాన్. ఇంటర్య్వూల్లోనూ చాలా స్మార్ట్‌గా మాట్లాడుతున్నాడు. అతడి ప్రదర్శనపై చాలా చక్కగా చెప్పగలుడుతున్నాడు. నేను 20 ఏళ్ల కిందట ఆడేటప్పుడు.. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. ఇప్పుడు మీడియాతో మాట్లాడటం కూడా ఓ విధి. అందుకే , బాబర్ ఇలాంటి సమస్య నుంచి బయటపడాలి. ఇది అతడికే ప్రయోజనం చేకూర్చుతుంది’’ అని అక్తర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్‌లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్‌ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల