Virat vs Gill Fans: శుభ్‌మన్‌ గిల్‌ సోదరి పోస్టుపై సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌!

సెంచరీ సాధించి బెంగళూరును (RCB) ఓడించడంలో కీలక పాత్ర పోషించిన గుజరాత్‌ (GT) ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్, అతడి సోదరిని విరాట్ అభిమానులు ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

Updated : 22 May 2023 13:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) చివరి లీగ్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై గుజరాత్‌ టైటాన్స్‌ (RCB vs GT) సూపర్‌ విక్టరీ సాధించింది. దీంతో 20 పాయింట్లతో అగ్రస్థానంతోనే గుజరాత్‌ లీగ్‌ స్టేజ్‌ను ముగించింది. మరోవైపు బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరదామని భావించింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (101) సెంచరీ సాధించాడు. అయితే, బౌలింగ్‌లో విఫలం కావడంతోపాటు గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (104*) కూడా శతకం బాదేసి బెంగళూరును ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఈ క్రమంలో గిల్ సోదరి షాహనీల్‌ మ్యాచ్‌ను వీక్షిస్తూ కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ‘ఇది ఎంతో సంతోషకరమైన రోజు’ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్టుపై గిల్ అభిమానులు అభినందనలు కురిపించగా.. విరాట్ ఫ్యాన్స్‌ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు మధ్య సోషల్‌ మీడియాలో వార్‌ ప్రారంభమైంది. కొందరు గిల్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టగా.. మరికొందరు విరాట్‌కు మద్దతుగా గిల్‌ను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. 

‘‘ఇవాళ శుభ్‌మన్‌ గిల్, అతడి సోదరిపై ట్వీట్లు పెడుతున్నవారిని ఓ సారి గమనించండి. విరాట్-అనుష్క తమ కుమార్తె వామికాను ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అత్యాచారం బెదిరింపులు చేసినా కూడా క్షమించి వదిలేయమని అతడిపై జాలి చూపించారు. అసలు అటువంటి వాడిని జైలుకు పంపించి కెరీర్‌ను ముగించాలి. ఇలాంటి పనులు మరొకరు చేయకుండా అతడో ఉదాహరణగా మారేవాడు’’ అని ఓ క్రికెట్‌ ప్రియుడు ట్వీట్ చేశాడు. 

దానికి ప్రతిగా... ‘‘కొందరు రుగ్మతకు గురైన కోహ్లీ అభిమానులు గిల్, అతడి కుటుంబ సభ్యులను అవమానించేలా పోస్టులు పెట్టారు. ఇలాంటి నెగిటివ్‌ ఎనర్జీ, విష ప్రచారంతో విరాట్ అభిమానులుగా ప్రకటించుకొనే కొందరి వల్లే కింగ్‌ కోహ్లీకు ఇబ్బందులు. ఎవరు ఎంత ఏడ్చినా సరే గిల్ భారత క్రికెట్‌కు భవిష్యత్తు సూపర్‌స్టార్’’ అని మరో అభిమాని ఘాటుగా స్పందించాడు. 

‘‘నేను విరాట్‌కు పెద్ద ఫ్యాన్‌ను. అయితే, గిల్ అద్భుతంగా ఆడాడు. గిల్ ఫ్యామిలీ విమర్శించే వారు నిజమైన విరాట్ కోహ్లీ అభిమానులు కాలేరు’’ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని