Sindhu: రెండో రౌండ్లో సింధు

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు శుభారంభం చేసింది.

Published : 23 May 2024 02:38 IST

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సింధు 21-17, 21-16తో స్కాట్లాండ్‌ క్రీడాకారిణి కిర్‌స్టీ గిల్మోర్‌పై విజయం సాధించింది. 46 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. సింధు దూకుడుగా ఆడి విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె.. సిమ్‌ యు జిన్‌ (దక్షిణ కొరియా)ను ఢీకొంటుంది. యువ షట్లర్‌ అష్మిత చాలిహా కూడా ముందంజ వేసింది. ఆమె 21-17, 21-16తో యున్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ)ని ఓడించింది. ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్లో ఉన్నతి 13-21, 18-21తో ఫాంగ్‌ జీ (చైనా) చేతిలో, ఆకర్షి 22-24, 13-21తో వాంగ్‌ జి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి-సిక్కి రెడ్డి జోడీ రెండో రౌండ్‌ చేరుకుంది. ఈ జంట 21-15, 12-21, 21-17తో చున్‌ వాయ్‌-చి యాన్‌ (హాంకాంగ్‌) ద్వయాన్ని ఓడించింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో కిరణ్‌ జార్జ్‌ 16-21, 17-21తో టకుమా (జపాన్‌) చేతిలో ఓడాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు