ODI WC 2023 - Ganguly: వరల్డ్ కప్‌ షెడ్యూల్‌.. ఆ అవకాశం చేజారడం బాధగా ఉంది: గంగూలీ

భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్‌ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భావోద్వేగానికి గురయ్యాడు.

Published : 29 Jun 2023 18:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World Cup 2023) షెడ్యూల్‌ను రెండు రోజుల కిందట అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ప్రకటించింది. అక్టోబర్‌ 5వ తేదీన ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రపంచ క్రికెట్‌ సంగ్రామం మొదలు కానుంది. భారత్ మాత్రం అక్టోబర్ 8న ఆసీస్‌తో వరల్డ్‌ కప్‌వేటను ప్రారంభించనుంది. దేశంలోని 10 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే భారత్ - పాక్‌ మ్యాచ్‌ (అక్టోబర్ 15న)తోపాటు ఫైనల్‌లో జరగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ భావోద్వేగానికి గురయ్యాడు. 

‘‘భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌ కోసం ఎదురు చూడండి. కొవిడ్‌ కారణంగా ఐసీసీ అధ్యక్షుడిని కాలేకపోయా.  ప్రపంచానికే భారత్‌ మార్గదర్శకంగా ఉండనుంది. అద్భుతమైన వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించేలా గొప్పగా కేటాయించారు. మరే ఇతర దేశం కూడా ఇలా పెద్ద సంఖ్యలో వేదికలను కలిగి లేవు. ప్రపంచం గుర్తుండిపోయేలా బీసీసీఐ ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుంది. బీసీసీఐ, జైషా, రోజర్‌ బిన్నీ, ఇతర ఆఫీస్ బేరర్స్, సిబ్బందికి శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.

బీసీసీఐ అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత సౌరభ్‌ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా వెళ్లాల్సింది. అయితే, బీసీసీఐ పెద్దలతోపాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి మద్దతు లేకపోవడంతో ఐసీసీ ఛైర్మన్‌గా పోటీ చేయలేకపోయాడు. ఒకవేళ ఐసీసీ ఛైర్మన్‌ హోదాలో ఉండి ఉంటే భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను గంగూలీనే ప్రకటించే అవకాశం వచ్చేది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు