IND vs SA: భారత్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు.. జట్లను ప్రకటించిన దక్షిణాఫ్రికా

త్వరలో భారత్‌తో జరగనున్న టీ20, వన్డే, టెస్టు సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా సెలక్షన్‌ కమిటీ జట్లను ప్రకటించింది. 

Updated : 07 Dec 2023 12:18 IST

ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని రోజుల్లో టీమ్‌ఇండియా (Team India) దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత సెలక్టర్లు ఇప్పటికే జట్లను ప్రకటించారు. తాజాగా దక్షిణాఫ్రికా (South Africa) సెలక్షన్‌ కమిటీ కూడా తమ జట్లను వివరాలను వెల్లడించింది. ప్రపంచకప్‌లో నిరాశపర్చిన కెప్టెన్ తెంబా బావుమాను టీ20, వన్డే సిరీస్‌ల నుంచి తప్పించారు. అతడి స్థానంలో ఐడెన్ మార్‌క్రమ్‌ (Aiden Markram)కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడను కూడా భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరం పెట్టారు. 2024 జనవరి 3 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌తో తిరిగి జట్టులోకి వస్తారు. డిసెంబరు 10 నుంచి టీ20 సిరీస్, డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. 

టీ20 జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.

వన్డే జట్టు: ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, వాండర్‌ డసెన్, కైల్ వెరిన్నే, లిజాడ్ విలియమ్స్.

టెస్ట్ జట్టు: తెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్‌, కైల్‌ వెరిన్నే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని