IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు అంకితం: సూర్యకుమార్

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ (Asia Cup 2025)లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ (Team India) బహిష్కరించాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు మ్యాచ్ జరగ్గా.. భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. దాయాది జట్టు నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సందర్భంగా, మ్యాచ్ అనంతరం పాక్ (Pakisatan) కెప్టెన్ సల్మాన్ అఘాతో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ మాట్లాడుతూ ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు.
‘పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాము. మనందరికీ వారు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తునే ఉంటాం’’ అని సూర్యకుమార్ వివరించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా సూర్య అదరగొట్టాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 47 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 - 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 


