
Rajasthan vs Bangalore: 27న క్వాలిఫయర్ 2.. రెండు జట్ల పరిస్థితి 10 పాయింట్లలో!
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్‌లో భాగంగా శుక్రవారం రాజస్థాన్, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్స్‌లో గుజరాత్‌తో తలపడతుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్, బెంగళూరు జట్ల పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అధిపత్యం ఎవరిది? అనే విషయాలకు సంబంధించిన 10 పాయింట్లు ఇవే..
- టీ20 లీగ్‌లో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించగా.. రాజస్థాన్ 11 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు. ఈ సీజన్‌లో రాజస్థాన్, బెంగళూరు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్ గెలిచాయి.
- రాజస్థాన్ ప్రధాన బలం జోస్ బట్లర్. ఈ సీజన్‌లో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. బట్లర్ 15 మ్యాచ్‌ల్లో 718 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
- రాజస్థాన్ బౌలింగ్ దళంలో యుజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ కీలకం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన చాహల్ (26) వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
- ఈ సీజన్‌లో లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గి ఐదింటిలో ఓడింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది.
- ఈ సారి బెంగళూరుకు కాస్త అదృష్టం కలిసొచ్చింది. దిల్లీపై ముంబయి విజయం సాధించడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది.
- లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూపై విజయం సాధించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది.
- బెంగళూరు బ్యాటింగ్‌లో కెప్టెన్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్‌తోపాటు ఎలిమినేటర్ మ్యాచ్‌లో శతకం బాదిన రజత్ పాటిదార్ కీలకం కానున్నారు.
- బెంగళూరు బౌలింగ్‌లో వానిందు హసరంగ, హర్షల్ పటేల్ కీలకం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 7.62 ఎకానమీతో 25 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ 14 మ్యాచ్‌ల్లో 7.56 ఎకానమీతో 19 వికెట్లు తీశాడు.
- రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్‌ని వీలైనంత తొందరగా పెవిలియన్ చేర్చితే బెంగళూరుకు విజయావకాశాలు మెరుగవుతాయి.
- మొత్తం మీద టైటిల్ పోరుకు అర్హత సాధించేందుకు జరిగే క్వాలిఫయర్-2 రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బలాబలాల పరంగా చూస్తే రాజస్థాన్‌కే కాస్త విజయావకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లోలాగా బెంగళూరు సమష్టిగా రాణిస్తే రాజస్థాన్ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Eknath Shinde: కొత్త సీఎంకు అసెంబ్లీలో బలపరీక్ష.. సోమవారానికి గడువు..!
-
General News
TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
-
India News
Maharashtra: సీఎం శిందే, రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి..!
-
Business News
GST: జీఎస్టీకి జీవం పోసిన వ్యక్తులు వీరే..!
-
General News
Andhra News: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే
-
Movies News
Sai Pallavi: ‘వెన్నెల’ పాత్ర చేయడం నా అదృష్టం: సాయిపల్లవి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Shivsena: శివసేన ముందు ముళ్లబాట!