PAK vs CAN: కెనడాతో మ్యాచ్‌.. ఆరోన్ హాఫ్‌ సెంచరీ.. పాక్‌ లక్ష్యం 107

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

Published : 11 Jun 2024 21:50 IST

న్యూ యార్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ ఎలో పాకిస్థాన్‌, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ పాక్‌కు చాలా కీలకం. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సూపర్‌-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్‌ (52; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే అర్ధ శతకం బాదాడు. కలీం సనా (13), సాద్ బిన్ జాఫర్ (10), డిల్లాన్ హేలిగర్ (9) పరుగులు చేశారు. నవనీత్ ధాలివాల్ (4), పర్గత్ సింగ్ (2), నికోలస్ కిర్టన్ (1), శ్రేయస్ మొవ్వ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.   రవీందర్‌పాల్ సింగ్ డకౌటయ్యాడు. పాక్‌ బౌలర్లలో హారిస్‌ రవూఫ్‌ 2, మహ్మద్‌ అమీర్‌ 2, షహీన్ అఫ్రిది, నసీమ్‌ షా తలో వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని