IPL 2024: ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మార్చి 22న తొలి మ్యాచ్‌

ఐపీఎల్‌ 2024 (IPL 2024) కొత్త సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. కేవలం 15 రోజుల్లో నిర్వహించే మ్యాచ్‌ల వివరాలను మాత్రమే ఐపీఎల్‌ నిర్వాహకులు వెల్లడించారు.

Updated : 22 Feb 2024 17:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2024) కొత్త సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ X రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. 

మ్యాచ్‌లు ఇలా..

  • మార్చి 22: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) X రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) (చెన్నై)
  • మార్చి 23: పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) X దిల్లీ క్యాపిటల్స్‌ (DC) (మొహాలీ)
  • మార్చి 23: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) X సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) (కోల్‌కతా)
  • మార్చి 24: రాజస్థాన్ రాయల్స్‌ (RR) X లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) (జైపుర్)
  • మార్చి 24: గుజరాత్‌ టైటాన్స్‌ (GT) X ముంబయి ఇండియన్స్‌ (MI) (అహ్మదాబాద్‌)
  • మార్చి 25: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు X పంజాబ్ కింగ్స్‌ (బెంగళూరు)
  • మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్‌ X గుజరాత్‌ టైటాన్స్ (చెన్నై)
  • మార్చి 27: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X ముంబయి ఇండియన్స్‌ (హైదరాబాద్‌)
  • మార్చి 28: రాజస్థాన్‌ రాయల్స్ X దిల్లీ క్యాపిటల్స్‌ (జైపుర్)
  • మార్చి 29: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు X కోల్‌కతా నైట్‌రైడర్స్ (బెంగళూరు)
  • మార్చి 30: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ X పంజాబ్‌ కింగ్స్‌ (లఖ్‌నవూ)
  • మార్చి 31: గుజరాత్‌ టైటాన్స్‌ X సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్‌)
  • మార్చి 31: దిల్లీ క్యాపిటల్స్‌ X చెన్నై సూపర్ కింగ్స్‌ (వైజాగ్‌)

ఏప్రిల్‌లో ఈ మ్యాచ్‌లు..

  • ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ X రాజస్థాన్‌ రాయల్స్ (ముంబయి)
  • ఏప్రిల్ 02: రాయల్ ఛాలెంజర్స్‌ X లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (బెంగళూరు)
  • ఏప్రిల్ 03: దిల్లీ క్యాపిటల్స్‌ X కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (వైజాగ్‌)
  • ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్‌ X పంజాబ్ కింగ్స్‌ (అహ్మదాబాద్‌)
  • ఏప్రిల్ 05: హైదరాబాద్‌ X చెన్నై సూపర్ కింగ్స్‌ (హైదరాబాద్‌)
  • ఏప్రిల్‌ 6: రాజస్థాన్‌ రాయల్స్ X రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపుర్)
  • ఏప్రిల్ 7: ముంబయి ఇండియన్స్ X దిల్లీ క్యాపిటల్స్‌ (ముంబయి)
  • ఏప్రిల్ 7: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్ (లఖ్‌నవూ)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని