IND vs NZ: బెక్‌హామ్‌తో మాటామంతీ.. జెర్సీలు ఇచ్చిపుచ్చుకొన్న దిగ్గజాలు.. హార్దిక్‌ స్టైల్‌ అదుర్స్.. స్పెషల్‌ వీడియోలు!

టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో కివీస్‌పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విన్నింగ్ మూమెంట్స్‌ అలరించాయి.

Updated : 18 Nov 2023 16:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో భారీగా వచ్చిన అభిమానుల మధ్య భారత్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వీడియోలను ఐసీసీ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

జెర్సీలు మార్చుకుంటూ..

వరల్డ్‌ కప్‌ తొలి సెమీస్‌కు ఇద్దరు దిగ్గజ క్రీడా ప్రముఖలు ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. టీమ్‌ఇండియా క్రికెట్‌ గాడ్ సచిన్‌తో కలిసి ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్‌ సందడి చేశారు. 


విరాట్ సెంచరీ.. సచిన్‌ ఫిదా

విరాట్ కోహ్లీ సెంచరీతో అలరించాడు. వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో తన 49 సెంచరీల రికార్డును అధిగమించిన విరాట్‌ను సచిన్ అభినందించాడు. అలాగే కోహ్లీకి అనుష్క ప్లయింగ్‌ కిస్‌లు ఇచ్చింది.


పాండ్య స్టైల్‌ అదుర్స్‌.. 

గాయం కారణంగా వరల్డ్‌ కప్‌ మధ్యలోనే వైదొలిగిన భారత స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య తొలి సెమీస్‌ సందర్భంగా వాంఖడే మైదానానికి వచ్చాడు. ఈ సందర్భంగా కొబ్బరి బోండాం నీళ్లను ఆస్వాదిస్తూ కనిపించాడు. 


బెక్‌హామ్‌తో మాటామంతీ.. ఫుట్‌బాల్

భారత ఆటగాళ్లంతా బెక్‌హామ్‌ను పరిచయం చేసుకుని సరదాగా సంభాషించారు. అలాగే బెక్‌హామ్‌తో ఫుట్‌బాల్‌ కూడా ఆడారు. ఈ సన్నివేశాలు అభిమానులకు కనువిందు చేశాయి.


ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ షమీ

న్యూజిలాండ్‌పై ఏడు వికెట్లు తీసిన మహమ్మద్‌ షమీ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడి బౌలింగ్‌ ప్రదర్శనను మరోసారి చూసేద్దాం..


12 ఏళ్ల నిరీక్షణకు తెర

దాదాపు పన్నెండేళ్ల తర్వాత భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2011లో చివరిసారిగా టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకుంది. అప్పుడే రెండోసారి మనం ఛాంపియన్‌గా నిలిచాం. గత వరల్డ్‌ కప్‌ల్లో (2015, 2019) సెమీస్‌లోనే ఓటమిపాలయ్యాం. ఇప్పుడా గండాన్ని అలవోకగా దాటేశాం.


ఇవి కదా సేఫ్‌ హ్యాండ్స్‌..

దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్‌ బ్యాటర్ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద రవీంద్ర జడేజా ఒడిసిపట్టిన తీరు అద్భుతం. బుమ్రా బౌలింగ్‌లో ఫిలిప్స్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో మ్యాచ్‌ టీమ్‌ఇండియా వైపు మొగ్గు చూపింది.


క్రీడాస్ఫూర్తికి నిదర్శనం

న్యూజిలాండ్‌ సెంచరీ హీరో డారిల్ మిచెల్ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, మ్యాచ్‌ మధ్యలో కండరాలు పట్టేయడంతో మైదానంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే భారత ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ డారిల్‌కు సాయపడ్డాడు. ఇషాన్‌ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. దీంతో క్రీడా స్ఫూర్తి ఇదేనంటూ అభిమానులు ప్రశంసించారు.


విరాట్ గురించి వివ్‌ రిచర్డ్స్‌

విరాట్ కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్‌పై క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ హర్షం వ్యక్తం చేశాడు. తానెందుకు విరాట్‌ను అభిమానిస్తానేది చక్కగా వివరించాడు.


విన్నింగ్‌ మూవ్‌మెంట్

న్యూజిలాండ్‌ చివరి వికెట్‌ను షమీ తీయడంతో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో మూడోసారి విశ్వవిజేతగా నిలవడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆఖరి వికెట్‌ తీసిన తర్వాత భారత క్రికెటర్లు, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని