Sanju-Pant: సంజూకి బదులు పంత్‌కు అవకాశాలు.. కారణమిదేనా..? వారిద్దరి గణాంకాలు ఇలా..?
ఇప్పుడు కేవలం ఇద్దరు టీమ్‌ఇండియా ఆటగాళ్ల గురించే చర్చ. వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు..? శాంసన్‌పై వివక్ష ఎందుకనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లోకి ముందే అడుగు పెట్టినా.. అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం రిషభ్ పంత్ కంటే సంజూ శాంసన్ వెనుకడుగే. ఫామ్ లేక ఇలా జరిగిందా అంటే.. కాదనే సమాధానం వస్తుంది. పంత్ కంటే సంజూదే బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువ. మరీ ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు, టీ20లు) గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సంజూ శాంసన్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనేలేదు.
రిషభ్ పంత్ 2017లో టీమ్‌ఇండియాకు ఎంపిక కాగా.. పంత్‌కు రెండేళ్ల ముందు అంటే 2015లోనే సంజూ భారత జెర్సీని ధరించాడు. ఇద్దరూ మొదట టీ20ల్లోనే అరంగేట్రం చేశారు. కానీ రిషభ్ పంత్ టెస్టుల్లోకి అడుగు పెట్టగా.. సంజూకి అవకాశం దక్కలేదు. కెరీర్ ఆరంభంలో రిషభ్ పంత్ కీలక ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. టెస్టుల్లోనూ దూకుడైన ఆటతీరుతో అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ గడ్డపైనా సెంచరీ (125*) సాధించి ఔరా అనిపించాడు. అలాగే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మైదానాల్లోనూ విజృంభించాడు. కానీ గత కొన్ని రోజులుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం పంత్ పూర్తిగా విఫలం కావడం విమర్శలపాలైంది.
కారణమదేనా..?
ఒకే ఏడాదిలో జరిగిన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్.. పలు ద్వైపాక్షిక సిరీస్‌లను పరిగణనలోకి తీసుకొంటే పంత్‌తో పోలిస్తే సంజూకి అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ శైలి అని నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే పంత్ లెఫ్ట్‌ఆర్మ్ బ్యాటర్ కాగా.. సంజూ కుడిచేతి వాటం కలిగిన ఆటగాడు. ప్రస్తుతం ఉన్న భారత మిడిలార్డర్‌లో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ పంత్ మాత్రమే. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎడమ చేతివాటం అయినా.. వీరంతా పూర్తిస్థాయి బ్యాటర్లు కాదు. అంతేకాకుండా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపైనే పేస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని పరుగులు సాధించడం కూడానూ పంత్ వైపే మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.
గత 10 మ్యాచుల్లో వీరిద్దరి ప్రదర్శన ఎలా ఉందంటే..?
* గత పది వన్డేల్లో రిషభ్ పంత్ ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలతో 336 పరుగులు చేశాడు. అదే సమయంలో సంజూ శాంసన్ ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 284 పరుగులు చేశాడు. కానీ యావరేజ్ మాత్రం సంజూదే అధికం కావడం గమనార్హం.
* ఇక టీ20ల విషయానికొస్తే.. సంజూ శాంసన్ ఒక్క అర్ధశతకంతో 223 పరుగులు చేశాడు. కానీ రిషభ్ పంత్ మాత్రం దారుణంగా విఫలం కావడం విశేషం. కేవలం నాలుగు సార్లు మాత్రమే డబుల్ డిజిట్ సాధించాడు. మొత్తం కలిపి 89 పరుగులు చేశాడు. అందుకే పంత్‌ను తప్పించి సంజూకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అభిమానుల నుంచి వస్తోంది.
మెగా టోర్నీలపై ప్రభావం..
పంత్‌కు బదులు.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్న సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌తోపాటు ఆసియా కప్ జరగనున్నాయి. వీరిద్దరి స్థానాలపై జట్టు యాజమాన్యం తేల్చకపోతే మెగా టోర్నీల్లో భారత్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావంపడే అవకాశం లేకపోలేదు. గత టీ20 ప్రపంచకప్‌లో దినేశ్ కార్తిక్‌పై భారీ అంచనాలు పెట్టుకొని పంత్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. ఆసీస్ గడ్డపై బాగా ఆడే అతడిని పక్కన పెట్టడం కూడా పంత్ ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఉంటుందని పలువురి విశ్లేషణ. అందుకే వచ్చే మెగా టోర్నీల్లో ఎవరిని ఆడించాలనే దానిపై బీసీసీఐ క్లారిటీతో ఉండాలి.
పంత్ కెరీర్ గణాంకాలు ఇలా..
* 31 మ్యాచుల్లో 43.32 సగటుతో 2,123 పరుగులు చేశాడు. అందులో ఐదు శతకాలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 159*.
* 27 వన్డేల్లో 36.52 సగటుతో 840 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 125*.
* అంతర్జాతీయ టీ20ల్లో 64 మ్యాచుల్లో 22.43 యావరేజ్‌తో 987 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 65. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.
సంజూ కెరీర్ ఇలా..
* అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ఏడేళ్లలో సంజూ కేవలం 11 వన్డేలను మాత్రమే ఆడాడు. 66 సగటుతో 330 పరుగులు సాధించాడు.
* టీ20లు.. 16 మ్యాచుల్లో 21.14 సగటుతో 296 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 77 పరుగులు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: క్యాప్షన్లేని రష్మిక ఫొటోలు.. కేతిక ‘ఫిబ్రవరి ఫీల్స్’!
-
Politics News
Yuvagalam-Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర.. ప్రచారరథం సీజ్ చేసిన పోలీసులు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ వచ్చేసింది.. దరఖాస్తు చేశారా?
-
Movies News
OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్
-
Sports News
Virat Kohli: ‘నువ్వు వెళ్లే మార్గం నీ మనస్సుకు తెలుసు.. అటువైపుగా పరుగెత్తు’: విరాట్ కోహ్లీ
-
General News
Polavaram: పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదు: కేంద్ర జలశక్తిశాఖ స్పష్టత