TSRTC: భారత్‌ Vs ఇంగ్లాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు.. రూట్‌లు ఇవే..

జనవరి 25 నుంచి ఉప్పల్‌ మైదానంలో జరగనున్న ఇంగ్లాండ్‌, భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

Published : 24 Jan 2024 14:48 IST

హైదరాబాద్‌: క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఇండియా Vs ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మైదానానికి 60 బ‌స్సుల‌ను న‌డపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ బస్సులు రోజూ ఉద‌యం 8 గంట‌ల నుంచి ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి బ‌య‌లుదేరుతాయని తెలిపారు. మ్యాచ్‌ వీక్షించాలనుకొనే క్రికెట్‌ అభిమానులు ఈ ప్రత్యేక బ‌స్సుల‌ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. బస్సు రూట్‌ల వివరాలు ఇవే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని