WPL: అలీసా, మెక్‌గ్రాత్ అర్ధ శతకాలు.. ముంబయి ముందు ఓ మోస్తరు లక్ష్యం
డబ్ల్యూపీఎల్ (WPL)లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)లో భాగంగా యూపీ వారియర్స్ (UPw), ముంబయి ఇండియన్స్ (MIw) మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ అలీసా హీలే (58; 46 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), తాహిలా మెక్‌గ్రాత్ (50; 37 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. దేవికా వైద్య (6), ఎకిల్ స్టోన్ (1), దీప్తి శర్మ (7) విఫలమవ్వగా.. కిరణ్ నవ్‌గిరె (17; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. శ్వేత (2), సిమ్రాన్ (9) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమేలియా కెర్ రెండు, హేలీ మాథ్యూస్ ఒక వికెట్ చొప్పున తీశారు.
సైకా ఇషాక్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ దేవికా వైద్య ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. మరో ఓపెనర్ హీలే మాత్రం దూకుడుగా ఆడింది. సైకా వేసిన నాలుగో ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాదింది. నాట్ సీవర్ వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి సిక్సర్ కొట్టింది. నిలకడగా ఆడుతున్న కిరణ్ నవ్‌గిరెను అమేలియా పెవిలియన్‌కు పంపింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్ దూకుడుగా ఆడింది. అమేలియా వేసిన 9 ఓవర్‌లో మెక్‌గ్రాత్ మూడు ఫోర్లు బాదింది. హీలే, మెక్‌గ్రాత్ వరుస ఓవర్లలో నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న వీరిద్దరిని 17 ఓవర్‌లో సైకా ఔట్ చేసింది. హేలీ మాథ్యూస్ వేసిన తర్వాతి ఓవర్‌లోనే ఎకిల్ స్టోన్ (1) కూడా పెవిలియన్ చేరింది. అమేలియా వేసిన చివరి ఓవర్లో మూడో బంతికి దీప్తి శర్మ స్టంపౌట్ అయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్
-
World News
Washington: వాషింగ్టన్లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్రను భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్
-
India News
Rahul Gandhi: పోలీసులు నిరాకరించినా.. ప్రారంభమైన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష